అదరగొట్టిన జడేజా.. ఒకే ఓవర్లో 6 సిక్సులు

Ravindra Jadejaటీమిండియా కోచ్ రవిశాస్త్రి, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ల సరసన చేరాడు యువ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు బాదిన క్రికెటర్ గా నిలిచాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఎస్‌సీఏ అంతర్‌ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం పది సిక్సర్లు, 15 ఫోర్లు బాదిన జడేజా.. 69 బంతుల్లోనే 154 పరుగులు చేశాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ నీలమ్‌ వంజా బౌలింగ్ చెలరేగిపోయిన జడేజా.. వరుసగా ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. దీంతో జామ్‌నగర్‌ 20 ఓవర్లలో 239/6 పరుగులు సాధించింది. అమ్రేలీ జట్టు 118 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇప్పటి వరకూ భారత ఆటగాళ్లలో రవిశాస్త్రి, యువరాజ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy