అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు

Rio de Janeiro : Indian women hockey players celebrate a goal against Japan during opening match of pool B at the Rio Olympic 2016 in Rio de Janeiro, Brazil on Sunday. PTI Photo by Atul Yadav (PTI8_7_2016_000207B) *** Local Caption ***

36 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒలింపిక్స్ లో అడుగుపెట్టిన భారత మహిళల హాకీ జట్టు మొదటి మ్యాచ్ లో ఆకట్టుకుంది. జపాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల్లో నుంచి బయటపడి డ్రా చేసుకుంది. ఫస్ట్ హాఫ్ లో దూకుడు ప్రదర్శించిన జపాన్ అమ్మాయిలు ఎమినిషికోరి,నకాషిమాలు చెరో గోల్ వేసి జపాన్ కు 2-0 ఆధిక్యాన్ని అందించారు.  అయితే సెకండాఫ్ లో భారత మహిళలు జపాన్ పై ఎదురు దాడికి దిగారు. ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పదేపదే జపాన్ గోల్ పోస్ట్ పై దాడులు చేశారు. బంతిని చక్కగా నియంత్రించగలిగారు. ఆట 30వ నిమిషంలో రాణి రాంపాల్  గోల్ సాధించగా..మరో 9 నిమిషాల వ్యవధిలోనే లీలిమా మిన్జ్ మరో గోల్ వేసి స్కోరును సమం చేశారు. చివర్లో గోల్స్ కోసం రెండు జట్లు తీవ్రంగా శ్రమించినా.. వీలు కాలేదు. దాంతో మ్యాచ్ డ్రా అయింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy