అదిరిపోయింది : నేల టిక్కెట్టు టీజర్ రిలీజ్

nelaమాస్‌ మహారాజా  రవితేజ హీరోగా నటిస్తున్న నేల టిక్కెట్టు సినిమా టీజర్ ను ఈ రోజు(ఏప్రిల్-22) విడుదల చేసింది మూవీ టీమ్. కల్యాణ్‌ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చుట్టూ జనం..మధ్యలో మనం..అలా ఉండాలిరా లైఫ్‌ అంటే అంటూ సాగే టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఏరా తినేస్తావా హీరోయిన్‌ మాళవిక శర్మ తిడుతున్నప్పుడు రవితేజ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఫన్నీగా ఉన్నాయి. రామ్‌ తుళ్లూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే నెలలో ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy