అది అనుకోకుండా జరిగింది… ఐయామ్ వెరీ సారీ

374214-hungarian-journo-twitterసిరియా శరణార్థులతో అమానుషంగా ప్రవర్తించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న హంగేరీకి చెందిన మహిళా జర్నలిస్టు పెట్రా లోజ్లో తన మౌనం వీడింది. ఆనాటి ఇన్సిడెంట్ కు తాను చాలా బాధపడుతున్నానని… అది అనుకోకుండా జరిగిపోయిందంటూ… తను పని చేసిన ఎన్ వన్ ఛానల్ కు రాసిన లేఖలో వివరణ ఇచ్చింది. హంగేరీలోకి శరణార్థులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఆ సమయంలో తను ఏం చేశానో తనకే తెలియదని వాపోయింది. ఇటీవల సిరియా చిన్నారి ఐలాన్ కుర్దీ మృతితో చలించిన ఈయూ దేశాలు శరణార్థులకు తమ దేశంలోకి రావడానికి అనుమతించాయి. దీంతో గత వారం సెర్బియా, హంగేరి సరిహద్దుల్లోని రోజ్కీ గ్రామంలోకి శరణార్థులు పరుగు పరుగున వెళ్తుండగా పెట్రా లోజ్లో కాలు అడ్డంపెట్టి మరీ శరణార్థులను కింద పడేసింది. ఈ విజువల్స్ ను మరో మీడియా సంస్థ షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఎన్ వన్ టీవీ… పెట్రా లోజ్లోను ఉద్యోగం నుంచి తొలగించింది.

Screen Shot 2015-09-10 at 10.09.43 AM

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy