అది అమలైతే.. కచ్చితంగా హిందీ నేర్చుకోవలసిందే

Hindiకేంద్రం మరో సంచలన నిర్ణయానికి రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా హిందీని కంపల్సరీ చెయ్యనుంది. సీబీఎస్‌ఈ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ పాఠశాలల్లో పదో తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరి చేయనున్నారు. అయితే దీనిపై రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీంతో పాటు మరికొన్ని సూచనలు చేసింది పార్లమెంటరీ కమిటీ. రాష్ట్రపతి సహా కేంద్రమంత్రులంతా తమ ప్రసంగాలను ఇకపై హిందీలోనే చేయాలట. పార్లమెంటరీ ప్యానెల్‌ సూచనల్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించిన వెంటనే దీనిని అమలుపరచనున్నారు. అధికార భాషపై 2011లో పార్లమెంటరీ సంఘం తొమ్మిదో కమిటీ రాష్ట్రపతికి సమర్పించిన నివేదికలో పేర్కొన్న సూచనల్లో అధికశాతం రాష్ట్రపతి ఇప్పటికే ఆమోదించారు. ఈ సూచనల ప్రకారం.. రాష్ట్రపతి సహా కేంద్రమంత్రులంతా తమ ప్రసంగాలను హిందీలోనే చేయాల్సి ఉంటుంది. పౌర విమానాల్లో ప్రకటనల్ని సైతం ఇంగ్లీష్‌కు బదులు హిందీలోనే చేయాలనే సూచనతో పాటు పలు కీలక సూచనలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎయిర్‌ ఇండియా టిక్కెట్లు, పవన్‌హాన్స్‌ హెలీకాప్టర్‌ టిక్కెట్లపై అధికశాతం హిందీ ఉపయోగించాలనే అంశానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

అలాగే ముస్సోరిలోని లాల్‌బహుదూర్‌ శాస్త్రి నేషనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అకాడమీలో నూరు శాతం ద్విభాషా మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలనే సూచనకు ఆమోదం తెలిపారు. అలాగే కరికులమ్‌లో హిందీ భాషను తప్పనిసరి చేసేందుకు కృషిచేయాలని కోరుతూ ఈ పార్లమెంటరీ ప్యానల్‌ జాతీయ మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy