అది ఫేక్ న్యూస్.. ఆ రైలు డ్రైవర్ సేఫ్.. సూసైడ్ చేసుకోలేదు..

అమృత్ సర్ : పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లో దసరా రోజు రైలు ప్రమాద సంఘటనకు మనస్తాపంతో ఆ రైలు నడిపిన లోకో పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజంలేదని అధికారులు క్లారిటీగా చెప్పారు. రాజకీయ నాయకులను బ్లేమ్ చేయడానికే ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని.. జనం భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వదంతులు నమ్మొద్దని పోలీసులు చెప్పారు. రైలు నడిపిన డీఎంయూ ట్రైన్ డ్రైవర్ తమ కస్టడీలోనే సేఫ్ గా ఉన్నాడని… పంజాబ్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది.

ఓ మనిషి ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఉరివేసుకుని ఉన్న ఫొటోలు.. వీడియోలను చూపిస్తూ.. అతడే ఆరోజు రైలు నడిపిన అరవింద్ కుమార్ అని… మనోవేదనతో సూసైడ్ చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ ఛానెళ్లలో వార్తలు తెగ తిరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు రైల్వే పోలీసు శాఖకు లోకో పైలట్ రాసిన వివరణ పత్రాన్ని సూసైడ్ లెటర్ గా ఆ పోస్టుల్లో చూపిస్తున్నారు. ఆ లెటర్ 19వ తేదీన రాసినట్టు అందులో ఉంది. ఇవాళ తేదీ అక్టోబర్ 22 కావడంతో… ఇది ఫేక్ న్యూస్ అనే విషయం అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

“మాకు రావణ దహనం జరుగుతున్న దానిపై ఎటువంటి సమాచారం లేదు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఎప్పటిలాగానే నిర్దిష్ట వేగంతోనే రైలును నడుపుతూ వెళ్లాను. అనుకోకుండా ఒక్కసారిగా జనాలు పట్టాలపై కనిపించడంతో… హారన్ మోగిస్తూ వచ్చాను. ట్రెయిన్ లో ఉన్న 2వేల మంది గురించి ఆలోచించి కూడా ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేశాను. ఐతే… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హారన్ కొట్టినా జనాలు స్పందించలేదు. అనుకోకుండా ఆ రోజు దుర్ఘటన , తప్పు జరిగిపోయాయి” అనేది లోకో పైలట్ అయిన అరవింద్ ఆరోజు రాసిచ్చిన ఎక్స్ ప్లనేషన్ లెటర్.

చనిపోయిన వ్యక్తి వీడియో దేనికి సంబంధించినది.. అతడు ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. ఐతే… ఈ వీడియో, ఫొటో మాత్రం అమృత్ సర్- జలంధర్ మధ్య డీఎంయూ ట్రెయిన్ నడిపిన డ్రైవర్ ది కాదని.. అతడు సురక్షితంగా రైల్వే పోలీస్ కస్టడీలోనే ఉన్నాడన్నది మాత్రం స్పష్టం చేశారు పంజాబ్ పోలీసులు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy