అదుర్స్..సదరోత్సాహం

sadarదీపావళి పండుగ సంబరాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన సదర్ వేడుకులు అదుర్స్ అన్పించాయి. నిఘనిఘలాడే నలుపుతో ప్రత్యేక అలంకరణతో ఆకర్షణీయంగా నిలిచిన దున్నపోతులు ఠీవీగా నడుస్తుండగా…వాటి ముందు ప్రత్యేక వేషధారణలతో నృత్యాలు చేస్తూ కళాకారులు, యువతీ యువకులు అలరించారు. రూ.25 కోట్ల విలువైన దున్నపోతు షహన్ షా, మహరాజా, ధారా,రాజాలతో పాటు చేవెళ్ల, హర్యానా, పంజాబ్ నుంచి వచ్చిన మేలుజాతి దున్నలు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. యాదవులు అత్యంత వైభవంగా జరుపుకునే సదర్ సంబురాలు ఖైరతాబాద్‌లో అంబరాన్నంటాయి. పంజగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల నుంచి ముస్తాబు చేసిన దున్నపోతులతో యాదవులు కుటుంబ సమేతంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. డప్పు దరువులు, ఆటపాటలు.. దున్నపోతుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. బాజాభజంత్రీల నడుమ అందంగా అలంకరించిన దున్నపోతులతో వాటి యజమానులు ర్యాలీగా నారాయణగూడకు చేరుకున్నారు. అక్కడ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిగూడ, బోయిన్ పల్లి, బొల్లారం, మారేడుపల్లి, కార్వాన్, గుడిమల్కాపురం, లాల్ దర్వాజా, రాణీగంజ్, నల్లకుంట, కాచిగూడ, నింబోలి అడ్డా, తదితర ప్రాంతాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనానికి గ్రేటర్ హైదరాబాద్ నుండే కాకుండా మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా దున్నపోతులను అలంకరించి తీసుకువచ్చారు. సదర్ వ్యవస్థాపకులు మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు రెడ్డి కాలేజ్ రోడ్డులో భారీ స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. గత 120 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్‌లో చౌదరీ సత్తయ్య యాదవ్ బ్రదర్స్, నవయుగ యాదవ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో సదర్ వేడుకలను నిర్వహిస్తున్నారు. తొలుత లైబ్రరీ నుంచి రైల్వే గేటు వరకు వందలాది దున్నపోతులను ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి హాజరు కాగా, వారికి కార్యక్రమ నిర్వహకుడు మంగళారపు మహేశ్ యాదవ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖైరతాబాద్‌లోవచ్చే ఏడాది ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, మధూకర్ యాదవ్, భవాని కృష్ణ యాదవ్, ఎం. యాదయ్య యాదవ్, లక్ష్మణ్ యాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy