అదే బండి.. అదే ఏరియా.. అదే మనిషి : గంటలో మూడు చైన్ స్నాచింగ్స్

chain-snatcher
సరదాగా బజారుకెళ్లి నాలుగు కూరగాయలు కొన్నట్లు ఉంది వాడి వ్యవహారం.. పనీపాట లేకుండా నాలుగు వీధులు తిరిగొచ్చినట్లు ఉంది వాడి దోపిడీ తీరు.. హైదరాబాద్ సిటీ మియాపూర్ ఏరియాలో జనవరి 10వ తేదీ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన వరస చైన్ స్నాచర్స్ కలకలం రేపాయి. అదే బండి.. అదే ఏరియా.. అదే మనిషి.. మూడు చోట్ల మూడు చైన్ స్నాచింగ్స్ చేశాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం రంగంలోకి దించారు.

బ్లాక్ అండ్ వైట్ కలర్ చెక్స్ షర్ట్ వేసుకున్న ఓ 22 ఏళ్ల కుర్రోడు.. బండి పోతూ.. నడుస్తూ వెళుతున్న మహిళ మెడలోని చైన్ లాక్కొని వెళతాడు. అప్పటి వరకు ఆ వీధిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న వాడు.. చుట్టూ ఎవరూ లేని సమయంలో చైనా లాక్కొని తీరిగ్గా వెళ్లిపోయాడు. ఆ తర్వా కొన్ని నిమిషాల్లోనే మరో నాలుగు వీధుల తర్వాత ఓ జంక్షన్ దగ్గర మరో మహిళ మెడలో చైన్ లాక్కెళ్లాడు. అది కూడా వీడే. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు మరో నాలుగు వీధుల తర్వాత మరో రాబరీ.. ఇలా గంటలో ఆ కుర్రోడు మూడు చైన్ స్నాచింగ్ చేయటం పోలీసులకు సైతం షాక్ గురి చేసింది. బండి నెంబర్ ను విజువల్స్ ద్వారా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే పట్టుకోవటానికి విచారణ వేగవంతం చేశారు పోలీసులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy