అదొక్కటి మాత్రమే : పాన్ – ఆధార్ లింక్ గడువు పెంపు

pan-adarబ్యాంకు ఖాతాలు, పాన్‌ కార్డులను డిసెంబర్‌ 31లోగా ఆధార్‌తో లింక్ చేసుకోవాలని యునైటెడ్ ఐడెంటిఫికేషన్ డెవలప్ మెంట్ అథార్టీ ఆఫ్ ఇండియా(UIDAI) తెలిపింది. దీనిపై ఇవాళ (శుక్రవారం,డిసెంబర్-8) స్పందించిన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ..పాన్‌-ఆధార్‌ లింక్ గడువును మాత్రమే మూడు నెలల పాటు అంటే 2018 మార్చి 31వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.  ఆధార్‌-పాన్‌ అనుసంధానం గడువును పొడిగించడం ఇది మూడోసారి.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. 2017 జులై 31 లోగా పన్ను చెల్లింపుదారులు తమ శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను ఆధార్‌ నంబర్‌తో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ అనుసంధాన ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రజల సౌకర్యం కోసం మొదట ఈ గడువును ఈ ఏడాది ఆగస్టు 31 వరకు పెంచింది ఆర్ధిక శాఖ. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. అయితే ఇంకా కొందరు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేకపోయారు. దీంతో వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు.. ఈ గడువును 2018 మార్చి 31వరకు పొడిగిస్తున్నామని తెలిపింది ఆర్థికశాఖ. అయితే ఈ గడువు పాన్- ఆధార్ తో అనుసంధానికి మాత్రమే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy