డ్రెస్సులు కొనక్కర్లేదు, కిరాయికీ తీసుకోవచ్చు

krishnaపెళ్లి. పార్టీ. ఏదో ఓటి. నలుగురి అటెన్షన్ ని డ్రా చేసి.. మన బ్యాగ్ లో వేసుకోవాలంటే.. స్పెషల్ గా ఉండాలి మరి. అంటే లుక్ కొత్తగా ఉండాలి. కనీసం నలుగురితో పాటైనా ఉండాలంటే.. చుట్టూ ఉన్నోళ్లకి తగ్గట్లే ఉండాలి. అందుకే ఈ లుక్కింగ్. బట్ పార్టీలు.. పెళ్లిళ్లూ రోజూ ఉండవ్. కానీ.. ఇలా రెడీ అవ్వాలంటే వేలకి వేలు పొయ్యాలి. అందరికీ కుదరక పోవచ్చు కదా. అందుకే.. హైదరాబాద్ కృష్ణానగర్ లోని రెంట్ డ్రస్ షాప్స్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. పట్టు చీర కావాలంటే పదివేలు పెట్టాల్సిన పన్లేదు. ఇక్కడికెళ్లి ఓ రెండొందలిస్తే చాలు. సూటూ బూటూక్కూడా అంతే. వేలకి వేలెందుకు దండగ. ఇక పార్టీ ఏదైనా.. దానికి తగ్గ డ్రస్ ఇక్కడ రెడీ. ఫేషనేదైనా ఫికర్ కావాల్సిన పన్లేదు. వెళ్లి ఓ రౌండేస్తే.. మనకి నచ్చింది పట్కొచ్చుకోవచ్చు. స్కూల్ ఫంక్షన్లు.. కాలేజీ పార్టీల్లో.. గ్రూప్ డాన్సులు గట్రా చాలానే ఉంటయ్. వాటన్నిటికీ అందరూ ఒకే డ్రస్ కొనాలంటే… అందరూ పర్సులు ఖాళీ చేసుకోవాలి. ఇక్కడైతే.. ఒక్కళ్ల పర్సులోంచి డబ్బు తీస్తే చాలు.. అందరికీ డ్రస్ లొస్తయ్. డ్రామాలు గట్రా వేసినా అంతే. ఎలాగూ రెండో రోజు వాటిని వేసుకోం కదా. రిటనిచ్చేస్తే.. వాళ్లే మళ్లీ రెడీ చేసి షోకేస్ లో పెట్టేస్తారు.

అఫ్ కోర్స్. రెంట్ డ్రస్ తీసుకునేదేంటి అని చాలామంది అనుకోవచ్చు. ఒక్కరోజు లుక్కు కోసం.. వేలకి వేలు పెట్టే స్తోమత.. ఇంట్రస్టూ అందరికీ ఉండకపోవచ్చు కదా. అలాంటి వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. ఎనీ టైం.. సిటీలోని క్రిష్ణా నగర్ లో ఇవి అవైలబుల్. ఒకప్పుడు సినిమాల్లో ట్రయల్స్ వేసే వాళ్లూ.. షూట్ లో అవసరమైన వాళ్లే ఇక్కడ రెంట్ కి తీసుకునే వాళ్లు. ఇప్పుడలా కాదు.. చాలా మంది ఈ రెంట్ డ్రస్ లు తీస్కెళ్తున్నారు. ఎవరడుగుతారు చెప్పండి ఎక్కడ తీస్కున్నారని.. ఒక వేళ అడిగినా.. సింగిల్ సెకన్ లో.. ప్లేస్ తో పాటు కాస్ట్ ని కూడా మేనేజ్ చేయొచ్చు. మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీతోనే బిజినెస్ ఫుల్ గా నడిచేది. అప్పటి వరకు సినిమా వాళ్లకి కావాల్సిన డ్రస్ మాత్రమే ఇక్కడ దొరికేవి. ఇప్పుడన్నీ అందుబాటులో ఉంచామంటున్నారు. జనం కూడా బానే వస్తున్నారు. ఫీలయ్యేదేముంది. కొన్ని డ్రస్ లు షాపుల్లో దొరక్క పోయినా.. ఇక్కడ మాత్రం రెడీ అంటున్నారు కస్టమర్లు. ఇలా వెరైటీ వెరైటీ డిజైన్స్ ని తక్కువ రెంట్ కే అందిస్తూ.. చాలా మంది సరదాలకి వీళ్లు సాయపడుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy