అద్బుత కట్టడం: భూమిలో హోటల్

షాంఘై నగరంలో ప్రపంచం లోనే తొలి భూగర్భ హోటల్‌ ను ప్రారంభించారు. ఈ హోటల్ పేరు షాంఘై వండర్‌ ల్యాండ్‌ . షెషాన్‌ పర్వతం చుట్టూ కట్టడాల వలయంలా కనిపించే షాంఘై నగరంలో ఈ హోటల్‌ ఓ నిర్మాణ అద్భుతం. షాంఘై నగర పర్యాటకులు తప్పక చూడాల్సిన వాటిల్లో షాంఘై వండర్‌ ల్యాండ్‌ ఒకటి. 90 మీటర్ల లోతున ఉన్న క్వారీలో ఈ హోటల్‌ ను నిర్మించారు.ఈ క్వారీలోని హోటల్‌ లోకి వెళ్లేందుకు, వచ్చేందుకు లిప్టు సదుపాయం ఉంది. లోతుగా తవ్విన క్వారీపై భూమికి సమాంతరంగా కప్పు నిర్మించారు. కింద బహుళంతస్తుల హోటల్‌ నిర్మాణం చేపట్టారు. ఈ హోటల్లో 18 అంతస్తులున్నాయి. ఇవన్నీ భూమిలోనే ఉన్నాయి. రెండు అంతస్తులు మాత్రం నీటికి దిగువన ఉన్నాయి. హోటల్‌లోకి గాలి, వెలుతురు ప్రసరించేలా క్వారీ ఓపెన్‌ గా ఉండే వైపున  గ్లాస్‌ తో అడ్డుగోడలు నిర్మించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy