అద్భుతంగా అమరావతి

photo2ఆంధ్రా రాజధాని కాబోతున్న అమరావతి ఎలా ఉంటుందనే ఊహలకు ఫుల్ స్టాప్. అమరావతి మోడల్ రిలీజ్ చేసి కొత్త సిటీని జనానికి పరిచయం చేసింది ఆంధ్రా సర్కారు. ఎన్నో సిటీల ప్లాన్స్ చూసి చివరకు సింగపూర్ లా ఉండాలని డిసైడైనట్టు వార్తలు వచ్చాయి. సింగపూర్ సర్కారు ఇచ్చిన ప్లాన్ చూసి అందరూ మరో సింగపూర్ లా ఉంటుందని ఊహించుకున్నారు. కానీ, దానికి కూడా మార్పులు జరిగాయి. ఇప్పుడు ఎనౌన్స్ చేసిన మాస్టర్ ప్లాన్ చాలా ప్రాక్టికల్ గా ఉందని అంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది అమరావతి నమూనా.

vlcsnap-2015-12-28-19h28m54s174అమరావతికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది. ఎన్నో వంశాలను చూసింది. ఎన్నో యుద్ధాలను చూసింది. మళ్ళీ ఇప్పుడో చరిత్రకు వేదిక కాబోతోంది అమరావతి. ఇండియాలో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా? అన్నట్టుగా కొత్త రాజధానికి ముస్తాబు చేయబోతున్నారు. ఇండియాలో మరే సిటీ లేని విధంగా మోడర్న్ గా అమరావతి సిటీ రూపుదిద్దుకోబోతోంది. ఎలా ఉండబోతోందో మరోసారి చూడండి.

vlcsnap-2015-12-28-19h29m11s98

ఆకాశాన్నంటే బిల్డింగులు, విశాలమైన రోడ్లు, రిక్రియేటింగ్ జోన్స్, గార్డెన్స్….అన్నీ ఇంటర్నేషనల్ స్టయిల్లో ఉండేలా ప్లాన్ తయారుచేశారు. ప్లాన్ ఒకసారి చూడండి.

 

అమరావతి ఒక నగరంగా కాకుండా ఇలా తొమ్మిది నగరాలుగా డెవలప్ చేస్తున్నారు. హెల్త్ కు, టూరిజానికి, చదువుకు, వ్యాపారానికి….ఇలా ఉంటాయా నగరాలు.

vlcsnap-2015-12-28-19h27m39s206స్వదేశీ, విదేశీ టూరిస్టులు ఎక్కువగా వచ్చే విధంగా సిటీ ప్లాన్ తయారయింది. సిటీ సెంటర్ లో ‘బ్రుందావనం’ పేరుతో ఒక పెద్ద గార్డెన్స్ వస్తుంది. అలాగే, వాటర్ స్పోర్ట్స్, రోప్ వే, మంగినపూడి దగ్గర బీచ్ కూడా ఎట్రాక్షన్స్ కాబోతున్నాయి. హైస్పీడ్ రైలు, మెట్రో రైలు కూడా కొత్త సిటీకి అలంకారాలవుతాయి. సిటీ చుట్టూ 3 గోల్ఫ్ కోర్సులు, ఒక పెద్ద క్రికెట్ స్టేడియం కూడా ఇంటర్నేషనల్ స్థాయిలోనే ఉండబోతున్నాయి.

vlcsnap-2015-12-28-19h26m58s168ఇదేదో ఒక్క ఏడాదిలోనో, రెండేళ్ళలోనో పూర్తయ్యే ప్లాన్ కాదు. 35 ఏళ్ళకు పూర్తి స్థాయి అమరావతిని చూడగలం.

 

 

vlcsnap-2015-12-28-19h29m27s20

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy