అద్భుత నటుడు అక్కినేని

akkineni-change-2ఎవర్ గ్రీన్ హీర్…. కళా ప్రపూర్ణ…. పద్మశ్రీ….పద్మ విభూషణ్. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు. ఇదీ తెలుగువారి అభిమాన హీరో అక్కినేని నాగేశ్వరావు లైఫ్ లోని హైలెట్స్. 90 ఏళ్ల పచ్చని పాట….వయసుని జయించి…. ప్రేమను పంచిన….నటుడు… ANR. నాటి దేవదాసు నుంచి నేటి శ్రీరామరాజ్యం వరకు ఎన్నో సినిమాలతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దసరాబుల్లోడు అక్కినేని నాగేశ్వర్రావు.  నటనకు నిలువెత్తు నిదర్శనం ఆయన. తెలుగోడి ప్రతిభను ప్రపంచానికి చాటిన నట దిగ్గజం…. అక్కినేని. నటనకు పర్యాయపదం….నాగేశ్వరరావు. నిన్నటి తరానికి దిక్సూచి.  భవిష్యత్ తరాలకు రోల్ మోడల్. ఇలా చెప్పుకుంటూ పోతే పదాలు చాలవు. ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి తెలుగు డిక్షనరీలో పదాలే లేవేమో అనిపిస్తుంది. నూతనోత్సాహం నింపిన దసరాబుల్లోడు. ఆధ్యాత్మిక పరిమళాలు పంచిన పాండు రంగడు. 250 పైగా సినిమాల్లో నటించిన ANR ఒక్కో చిత్రంలో తన నటనా వైవిద్యంతో అందరినీ మెప్పించారు. ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. తెలుగు సినిమా ఉన్నన్నాళ్లు ఏఎన్నార్ సినిమాలు క్లాసిక్స్ గా నిలుస్తాయనడంలో సందేహం లేదు. మొదటి సినిమా నుంచి సీతారామయ్య మనవరాలు వరకు ఆయనే హీరో. పౌరాణికం, సాంఘికం, జానపద సినిమాలు ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేశారు అక్కినేని. అప్పట్లో పౌరాణికాల్లో ఎన్టీఆర్ దేవుడు క్యారెక్టర్లు వేస్తే ANR భక్తుడిగా చేసిన సినిమాలే ఎక్కువ. ఇక జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ మహరాజుగా నటిస్తే అక్కినేని కవిగా నటించి తనదైన నటనా కౌశల్యాన్ని కనబరిచారు. నవరాత్రులు సినిమాలో ఏకంగా 9 పాత్రలు పోషించి రికార్డు క్రియేట్ చేశారు…ANR.  దేవదాసు సినిమాలో భగ్న ప్రేమికుడిగా నటించినా మూగమనసులో పల్లెటూరి అమాయక కుర్రాడిని మరిపించినా…..ఆయనకు ఆయనే సాటి. ఇక సీతారామయ్యగారి మనవరాలులో తాత క్యారెక్టర్ చేసి… తాతనే హీరో చేసిన విదాత అక్కినేని. హీరోగానే కాదు…..క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనదైన ముద్ర వేసుకున్నారు….. అక్కినేని. నట ప్రస్థానం మొదలైనప్పటి నుంచి 90 ఏళ్ల వయసు వరకు నటించడం కూడా ANR కే సాధ్యమైంది. కొడుకు నాగార్జునతో కలిసి శ్రీరామదాసు సినిమాలో కబీర్ దాస్ పాత్రలో కనిపించి ఔరా అనిపించారు. ఇక తన కెరీర్ లో చివరి సినిమాలలో ఒకటి అయిన శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా నటించి ఆ క్యారెక్టర్ నూటికి నూరు శాతం న్యాయం చేశారు.

అక్కినేని తన కొడుకు నాగార్జున, మనుమడు నాగ చైతన్య లతో కలిసి నటించిన సినిమా “మనం” నిర్మాణం పూర్తీ చేసుకునే దశలో ఉంది.

వయసును జయించి…. ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలోఅక్కినేనిని మించిన నటులు ఇండస్ట్రీలో లేరు… ఇక మీదట రారేమో కూడా.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy