అద్వానీ… మాటలకు అర్థాలే వేరులే…

BL12_PG1_ADVANI1_1483701f
అద్వానీ మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు బిజెపి నాయకులు. తెలంగాణ విషయంలో పార్లమెంట్ లో జరుగుతున్న రచ్చపై ఆయన ఇటీవల చేసిన కామెంట్లు పార్టీలో కాకపుట్టించాయి. తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో పెట్టకూడదని అద్వానీ ఖరాఖండిగా చెప్పేశారు. అస్సలు ఇలాంటి సమావేశాలను తాను ఎన్నడూ చూడలేదని సెలవిచ్చారు. సొంత పార్టీ సభ్యులే సభను అడ్డుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ముందుగా తమ పార్టీ సభ్యులను అదుపులో పెట్టుకోవాలని కూడా సెలవిచ్చారీ పెద్దమనిషి. పార్లమెంట్ లో బిష్ముడిలా ఉన్న ఈ నాయకుడు గతం పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. ఎన్డీఎ హయాంలో మూడు రాష్ర్టాలు ఏర్పాటు చేసినప్పుడు జరిగిన గలాటా అంతా ఇంతా కాదు. భాగస్వామ్య పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా అద్వానీ బిల్లును మూజు వాణి ఓటుతో నెగ్గించి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఇది గడిచిన పదిహేను ఏళ్లు అయింది. రోజులు గడిచిపోయి ఉండొచ్చు కానీ వాస్తవాలు చెదిరిపోవు కదా. బిహార్ రాష్ర్టాన్ని విడగొడుతున్న సందర్భంలో అంటే 2000 సంవత్సరంలో బిల్లు ప్రవేశపెట్టకుండా ఆర్జెడి సభ్యులు రఘువంశ్ ప్రసాద్, సురేంద్ర ప్రసాద్ పెద్ద రచ్చ చేశారు. ఇప్పుడు సీమాంధ్ర ఎంపిలు చేసినట్లే వారూ చేశారు. లగడపాటి లాంటి సీన్ అప్పూడూ కన్పించింది.అయితే అప్పుడు పెప్పర్ స్ప్రే లేదు, ఇప్పుడు ఉంది అంతే తేడా. రీటావర్మ సంఘటన పార్లమెంట్ చరిత్రలోనే తొలి సారి. సురేంద్ర ప్రసాద్ ను రీటావర్మ చావబాదారు. ఇలా జరగడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి. ఎంపిల మధ్య ఇంత పెద్ద స్థాయిలో సభలో ఘర్షణ జరగడం అద్వానీ హయాంలోనే జరిగింది.కానీ ఇవేవీ గుర్తు లేనట్టుగా మాట్లాడుతున్న అద్వానీ ఇప్పుడు సభ జరుగుతున్న తీరుపై మాత్రం కన్నీరు కారుస్తున్నారు. శాంతియుత వాతావరణంలో రాష్ర్టాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ విభజనసమయంలోనూ పెద్ద రభసే జరిగింది. టిఎంసి, బిజెడి ఈ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పుడు కాంగ్రెస్, ఆర్జేడి, ఎస్పీ ఎంపిలు వెల్ లోకి దూసుకెళ్లారు. ఇంత హంగామా జరిగినా తాము శాంతియుతంగా చేశామని అద్వానీ గప్పాలు చెప్పుకుంటున్నారు.

మూడు రాష్ట్రాలూ మూజువాణితో గట్టెక్కినవే. కానీ అద్వానీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్దాలని టి.బిజెపి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

బుచ్చన్న, వి6 స్పెషల్ కరస్పాండెంట్

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy