అధికారం లేక ఏడుస్తుంటే..విభేదాలెక్కడివి ?

JANANANANAతమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని సీఎల్పీ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీలో ఆధిపత్య పోరు…పార్టీ పగ్గాల కోసం జానారెడ్డి పావులు కదుపుతున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. పార్టీ ఎమ్మెల్యేలతో, ఓడిపోయిన అభ్యర్ధులతో సమావేశం నిర్వహిస్తున్నాని చేస్తున్న ప్రచారాన్ని జానారెడ్డి తిప్పి కొట్టారు. తనకు, పొన్నాలకు మధ్య ఎలాంటి ఆధిపత్య పోరు లేదని…ఇద్దరం టచ్ లోనే ఉన్నామని జానారెడ్డి తెలిపారు. ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమి గురించి విశ్లేషణ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాల్లేవని…అంతా కాంగ్రెస్ కార్యకర్తలమేనని జానారెడ్డి తెలిపారు. వ్యతిరేకంగా మాట్లాడితే వారిని విమర్శించి ఐక్యత చాటుకుంటామన్నారు. పార్టీ కోసం కార్యకర్తలా పనిచేస్తానన్నారు జానా. ఇక అధికారం లేక ఏడుస్తుంటే ఆధిపత్య పోరు ఎక్కడుందని కామెంట్ చేశారు జానారెడ్డి. అందరం కలిసి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యచరణ కోసం చర్చ జరగాలని దాని కోసమే సమావేశం నిర్వహించాలనుకున్నామని ఆయన అన్నారు. పీసీసీ చీఫ్ గా ఎవరున్నా గౌరవించాల్సిందేనని అన్న జానారెడ్డి పొన్నాల అధ్యక్షతనే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy