అధికార లాంఛనాలతో కోనేరు అంత్యక్రియలు

koneruమాజీమంత్రి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కోనేరు నాగేశ్వరరావు (80) మృతికి సంతాపం ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా అమూల్య సేవలందించారన్న ఆయన..  అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కోనేరు భౌతికకాయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ చైర్‌పర్స న్‌ గడిపల్లి నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి టీడీపీకి తీరనిలోటని పేర్కొంటూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబంతో తమకు అవినాభావ సంబంధం ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంతరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంతాపం ప్రకటించారు. సీఎల్పీ నేత జానారెడ్డి కూడా కోనేరు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోనేరు అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో పెనగడప దగ్గరగల వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy