అనంత్‌నాగ్‌లో ఎన్ కౌంటర్ : మహిళ మృతి

kashmir-armyజ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మహిళ మృతి చెందింది. అనంత్‌నాగ్‌లో ఇవాళ ఉద‌యం ఉగ్ర‌వాదులు, ఇండియన్ ఆర్మీకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ ఇంట్లో దాక్కుకున్న ఉగ్ర‌వాదుల‌ను త‌రిమేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్పుల‌కు దిగాయి. ఆ స‌మ‌యంలో 44 ఏళ్ల త‌హిరాకు గాయాల‌య్యాయి. అయితే ఆమెను హాస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో ప్రాణాలు విడిచింది. ముగ్గురు ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో బ్రెంటీ బ‌ట్పోరా ప్రాంతంలో ఆర్మీ భారీ కూంబింగ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టింది. బ‌షీర్ ల‌ష్క‌రీ అనే ఉగ్ర‌వాది ఆ గ్యాంగ్‌లో ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy