అనాథ శవానికి విదేశీ మహిళ  అంత్యక్రియలు

forein womanపర్యాటనకు వచ్చిన ఓ విదేశీ మహిళ ముఖ పరిచయం కూడా లేని ఓ అనాథ శవానికి అన్నీ తానై అంత్యక్రియలను నిర్వహించింది. ఒక మనిషి తుది శ్వాస విడిస్తే ఇంత గొప్పగా వీడ్కోలు పలుకుతారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఆ విదేశీ వనిత. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్ధురాలయ్యింది ఆ యువతి.
సేవాభావంతో మనదేశంలో పర్యటిస్తోంది ఆస్ట్రేలియాకి చెందిన జార్జియా. సికింద్రాబాద్‌లోని కార్ఖానాలో ఉన్న ‘సెర్వ్‌ నీడీ’వలంటరీ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన 14 ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు మూడు రోజుల క్రితం నగరానికి వచ్చింది ఆమె. అప్పటి నుంచి తనదైన శైలిలో అక్కడున్న అనాథ పిల్లలకు కావాల్సిన అవసరాలను తీరుస్తోంది. ఇదే సమయంలో తనకున్న టాలెంట్‌తో కామెడీ, లాంగ్‌ స్విమ్మింగ్, వాయిస్‌ ప్లే వంటివి చేస్తూ.. వాటి ద్వారా వచ్చిన డబ్బును వివిధ సేవా సంస్థలకు దానం చేస్తోంది జార్జియా. అనాథ పిల్లల చదువులకు, కేన్సర్‌ రోగుల వైద్య ఖర్చులకు తన డబ్బు ఉపయోగపడటం చాలా ఆనందంగా ఉందంటోంది జార్జియా.

అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం ‘సెర్వ్‌ నీడీ’సేవా కార్యక్రమాల్లో ఒకటి. ఇదే క్రమంలో నగరంలోని ఓ షెల్టర్‌ హోమ్‌లో ఇటీవల మృతిచెందిందిన ఓ మహిళకు  అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడ్డారు సెర్వ్‌ నీడీ వ్యవస్థాపకుడు గౌతమ్‌కుమార్‌. ఈ సంస్థ కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్న జార్జియా ముందుకు వచ్చి అంత్యక్రియల క్రతువు తానే చేస్తానంది. ఈ అనాథ అతివను నా సోదరి అనుకుని నేనే తలకొరివి పెట్టాలనుకుంటున్నాను తనకు అవకాశం ఇవ్వమని కోరింది ఆ విదేశీ యువతి. అందుకు అంగీకరించి ఆమెకు సహకరించారు సెర్వ్‌ నీడీ వ్యవస్థాపకుడు  గౌతమ్‌కుమార్‌. హిందూ సంప్రదాయం ప్రకారం చేయవలసిన, పాటించవలసిన తుది క్రతువులన్నీ తెలుసుకుని, అంత్యక్రియల్ని పూర్తి చేసింది జార్జియా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషికి వీడ్కోలు పలికే సమయంలో ఇక్కడి ఆచారాలు, పద్ధతులు చాలా గొప్పగా అనిపించాయంది.. బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ఆ మనిషికి విలువ ఇచ్చే సంస్కృతి చాలా నచ్చిందంటుంది ఆ విదేశీ యువతి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy