అనుకున్న సమయానికే కాళేశ్వరం : హరీశ్

HARISHఅనుకున్న టైమ్ కే కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ మంత్రి హరీశ్. మూడు షిప్టుల్లో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి. బ్యారేజీలు, పంప్ హౌజ్ ల పనులను పరిశీలించారు. తర్వాత అధికారులతో రివ్యూ చేశారు హరీశ్.వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తామన్నారు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు. మూడు షిఫ్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. గడువులోగా మూడు బ్యారేజీలు, మూడు పంప్ హౌజ్ ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు హరీశ్. బ్యారేజీలు, పంఫౌజ్ ల పనులను తనిఖీ చేశారు. అన్నారం బ్యారేజీ గేట్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు.

కాళేశ్వరంకు సంబంధించిన బ్యారేజీలు, పంప్ హౌజ్ పనుల్లో 80 శాతం సిమెంటు కాంక్రీటు పనులు పూర్తయ్యాయని చెప్పారు మంత్రి. మరో 2 నెలల్లో మిగతా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై కన్నెపల్లి దగ్గర అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. వేసవి కాలంలో రాత్రి వేళల్లో పనుల వేగం కోసం అవసరమైన చోట కొంతమంది ఇంజనీర్లను డిప్యుటేషన్ పై నియమిస్తామన్నారు హరీశ్. కన్నేపల్లి, మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం పంప్ హౌజ్ లకు అవసరమైన యంత్రాలు మరో పది రోజుల్లో విదేశాల నుంచి వస్తాయన్నారు.

కన్నేపల్లి-అన్నారం మధ్య అటవీ ప్రాంతంలో 13.35 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులను పరిశీలించారు హరీశ్. ఈ కెనాల్ పనుల్లో మట్టి పనులు త్వరలో పూర్తి కానున్నాయని వివరించారు అధికారులు. స్ట్రక్చర్ల నిర్మాణం సహా అన్నీ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ నిర్మాణాల్లో అప్రోచ్ కెనాల్ పనులు చాలా కీలకమని చెప్పారు మంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు అవసరాలకు ప్రత్యేక విద్యుత్ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఎత్తిపోతల పథకాలకు 12 వేల 500 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. ఈ పనులకు సంబంధించి విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు హరీశ్ . బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కరకట్టలు, కాలువలు, రిజర్వాయర్ల పనులన్నీ సమాంతరంగా జరిగేలా చూస్తున్నారు మంత్రి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy