అనుష్కను ఆడిపోసుకుంటున్న ఫ్యాన్స్

VIRATక్రికెట్ ఫ్యాన్స్ మరోసారి అనుష్కను ఆడిపోసుకుంటున్నారు. ముంబై వాంఖడేలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ వైఫల్యానికి ఈ బాలీవుడ్ బ్యూటీనే కారణం అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. స్టేడియంలో విరాట్ క్రీజ్ లో ఉన్నంత సేపు.. అనుష్కను చూపిస్తూ హైప్ క్రియేట్ చేశారు. ఫస్ట్ సిక్స్ కొట్టగానే.. స్టాండ్స్ లోని అనుష్కను చూపించటంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కేకలు, అరుపులు. ఆ వెంటనే ఔట్ అయినప్పుడు కూడా గ్రౌండ్ లోని విరాట్ ఫీలింగ్స్ కంటే.. గ్యాలరీలోని అనుష్క శర్మ ఫీలింగ్సే ఎక్కువగా క్యాచ్ అయ్యాయి. టీవీల్లోనూ ఇదే కనిపించింది. దీంతో నెటిజన్లు మరోసారి ఒక్కసారిగా అనుష్కపై పడ్డారు.

అనుష్కకు వ్యతిరేకంగా కామెంట్స్

  • విరాట్ ను తనచుట్టూ తిప్పుకోవటం వల్లే కోహ్లీ ఫెయిల్ అవుతున్నాడని.. ఇప్పటికైనా వదిలేస్తే కోహ్లీ ఆటపై దృష్టిపెడతాడు
  • షారూఖ్ ఖాన్ పై ముంబై క్రికెట్ అసోసియేషన్ బ్యాన్ విధించింది.. దానిబదులు క్రికెట్ గ్రౌండ్స్ లోకి రాకుండా అనుష్కపై బ్యాన్ విధించాలి
  • అనుష్క లవ్ లో పడిన తర్వాతే కోహ్లీ ఆటపై కాన్సట్రేషన్ పెట్టలేకపోతున్నాడు.. ప్లీజ్ మావాడిని వదిలేయ్

అనుష్కను వెనకేసుకొచ్చిన కామెంట్స్

  • విరాట్ విఫలం అయినప్పుడు అనుష్కను అంటున్నారు.. అదే అనుష్క సినిమా ఫ్లాప్ అయినప్పుడు కోహ్లీని ఎందుకు అనరు
  • బాంబే వెల్వెట్ ఫ్లాప్ అయినప్పుడు ఒక్కరైనా కోహ్లీని తిట్టారా.. కారణం విరాట్ అని
  • కోహ్లీ ఒక్కడికే గాళ్ ఫ్రెండ్ లేరు.. మిగతా ఆటగాళ్లందరికీ ఉన్నారు.. మరి అనుష్కనే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy