అనూహ్యను చంపింది క్యాబ్ డ్రైవరే !

సంచలనం కలిగించిన అనూహ్య హత్యకేసు ఒక కొలిక్కి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ హత్య చేసింది క్యాబ్ డ్రైవరేనని అక్కడి పోలీసులు తేల్చారు. అనూహ్య తండ్రికి ఈ విషయాన్ని ముంబై పోలీసులు ఫోన్ చేసి చెప్పారు.

ఆ క్యాబ్ డ్రైవర్ నాసిక్ లో దొరికాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని గుర్తుపట్టినట్టు పోలీసులు తెలియజేశారు. నేరాన్ని అతను ఒప్పుకున్నాడు. ముంబై రైల్వేస్టేషన్ నుంచి అనూహ్యను అతనే క్యాబ్ లో తీసుకెళ్లాడు. ఆ తరువాత ఆమెను రేప్ చేసి చంపేశాడు. మచిలీపట్నానికి చెందిన 23 ఏళ్ళ అనూహ్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ముంబైలో పనిచేస్తోంది.

ఈరోజు అతన్ని మీడియా ఎదుట ప్రవేశపెడతామని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులు ఫోన్ లో చెప్పినప్పుడు  అనూహ్య లాప్ టాప్ ను, ఇతర వస్తువులను తనకు చూపించాలని ఆమె తండ్రి ప్రసాదరావు పోలీసులను కోరారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy