అన్నదాతకు భరోసాగా కళాకారులు

an-1276616708889అన్నదాతల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అన్ని వర్గాలు కదులుతున్నాయి. రాజకీయ పార్టీలకు తోడు ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు రైతులు ఆత్మ హత్యలు చేసుకోవద్దని కోరుతున్నారు.  హైదరాబాద్ లో తెలంగాణ రచయితల వేదిక నిర్వహించిన భరోసా పాట ప్రోగ్రామ్ కు కవులు, కళాకారులు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రుణమాఫీ అమలు చేసి … కొత్త రుణాలివ్వాలన్నారు పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం. రుణాల కోసం బ్యాంకులు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు … ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.

25week pointఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరిచిపోయిందన్నారు … ప్రజా గాయకుడు అందెశ్రీ. రైతు ప్రయోజనాల కోసం, తెలంగాణ రక్షణ కోసం మరోసారి పోరాటలకు సిద్ధం కావాలన్నారు.  అన్నదాతల ఆత్మహత్య నివారణకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. అన్నం పెట్టే అన్నదాత … ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు తిరుమలరావు. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతులకు అండగా ఉన్నామని చెప్పడానికే ఈ భరోసా గీతం కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ప్రతిపక్షాలు, ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ విమలక్క. రైతులకు ఎవరూ భరోసా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా అన్నదాతలు … ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సూసైడ్ చేసుకున్న రైతు కుటుంబాలు అనుభవిస్తున్న బాధను చెప్పుకొచ్చారు మహిళలు.  ఇంటి పెద్దదిక్కు లేకపోవడంతో.. కుటుంబ భారం .. పెను భారంగా మారిందన్నారు. అప్పుల చిక్కుల్లో ఉన్న తమను.. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వేడుకున్నారు. అన్నదాతల సూసైడ్ లను చిత్రకారులు…  పెయింట్ తో చూపించారు. మరోవైపు రైతు ఆత్మహత్యలను … కళాకారులు నాటక రూపంలో ప్రదర్శించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అందరూ భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ముందుకు నడవాలన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy