అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది

AGRIహార్టికల్చర్ యూనివర్శిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం ఎంతో సంతోషమన్నారు కేంద్రమంత్రి  రాధామోహన్‌సింగ్. లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు గాంధీ వంటివారన్నారు. మెదక్‌ జిల్లా ములుగులో ఉద్యాన వర్శిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. దేశంలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం సుభిక్షంగా ఉండాలంటే అన్నదాత బాగుండాలన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత రైతు సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టారు. తక్కువ నీరు.. ఎక్కువ సాగు నినాదం తీసుకువచ్చామని తెలిపారు రాధా మోహన్ సింగ్. గత పదేళ్లలో రైతులను ఆదుకునేవారే కరువయ్యారన్నారు. రైతుల కోసం భూసార పరీక్ష కార్డులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ-మార్కెటింగ్ విధానం వల్ల రైతులకు మేలు కలుగుతుందన్నారు. దేశమంతటా ఒకే మార్కెటింగ్ విధానం ఉండేలా కృషి చేస్తామన్నారు. దళారీ వ్యవస్థ వల్ల రైతులు నష్టపోతున్నారు. అన్ని పంటలకు తెలంగాణలో వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉందన్నారు.

KCR- RADHAMOHANరాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా డెవలప్ చేస్తా: సీఎం

ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్, అటవీ కళాశాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.  1300 ఎకరాల్లో మూడు ఇనిస్టిట్యూట్స్ ప్రారంభించుకున్నందుకు గజ్వేల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్‌లో రూ.50 కోట్లతో అటవీ కళాశాల ఏర్పాటు కాబోతోందని తెలిపారు. ఏప్రిల్ 30న ఇంటింటికి నల్లా పథకాన్ని ప్రారంభించనున్నట్ల తెలిపారు.  ఒంటిమామిడి మార్కెట్‌లో రూ.20 కోట్లతో కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. రాధామోహన్‌సింగ్‌తో మరోసారి సమావేశమై వర్శిటీల డెవలప్ మెంట్ పై చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల తరపున రాధామోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు సీఎం. ఆయన చేసిన సూచనలు పాటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గోడౌన్ల కొరత ఉందని…. గోడౌన్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అతితక్కువ ఫారెస్ట్ కాలేజీలు ఉన్నాయన్నారు. హార్టికల్చర్ వర్సిటీ, రీసెర్చ్ సెంటర్ రాష్ర్టానికి విశిష్ట సేవలు అందిస్తోందని తెలిపారు. త్వరలోనే అద్భుతమైన ప్రయోగశాలలు రాబోతున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  రాష్ట్రంలో విత్తనాల తయారీ జరుగుతోందన్న సీఎం కేసీఆర్… రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy