
ఘటనా స్థలానికి కొద్ది సేపటి క్రితం చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ప్రస్తుతం మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్టూడియో ఏరియాలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదానికి గల కారణాలు.. నష్టం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్కినేని కుటుంబానికి చెందిన ఈ స్టూడియోలో…సినిమాలతోపాటు, సీరియళ్లు, రియాల్టీ షోల షూటింగులు జరుగుతాయి.