అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌

ktrఆత్మీయతతో పెనవేసుకునే సోదరభావం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌. అన్న, తమ్ముళ్లు బాగుండాలని అక్కచెల్లెళ్ల ఆకాంక్ష… అక్కచెల్లెళ్లు క్షేమంగా ఉండాలని అన్నదమ్ముల తపన… ఆత్మీయతలతో పెనవేసుకునే సోదరభావమే రాఖీ పౌర్ణమి ప్రధాన ఉద్దేశం. సోదర, సోదరిల మధ్య అనురాగాలు, అనుబంధాలు మరింత పెరిగేందుకు రాఖీ దోహదపడుతుంది. నగరంలో సోమవారం రక్షాబంధన్‌ సందడి స్పష్టంగా కన్పించింది.  ఇక్కడ ఉన్న అన్నదమ్ములకోసం అక్కచెల్లెళ్లు గ్రామీణ ప్రాంతాలు, ఇతర చోట్ల నుంచి నగరానికి వచ్చారు. రాఖీ కడితే సోదరికి డబ్బు, చీరలు, నగలు బహుతులుగా ఇవ్వడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతల్లో అక్కచెల్లెళ్లు మునిగి తేలుతుంటారు. చాలామంది వారి ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ సారి మాత్రం పలువురు సోదరులు వారి సోతరిమణులకు బహుమతిగా హెల్త్‌ ప్యాకేజీని బహూకరించారని తెలుస్తోంది. ఇందులో బ్రెస్ట్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ పరీక్షలు ఉండేలా చూసుకొన్నారటా..

అన్నకు కవిత కానుక హెల్మెట్
కాలానికి అనుగుణంగా రాఖీ సరికొత్త సంప్రదాయాలకు వేదికగా మారుతోంది. రాఖీ అంటే చెల్లికి అన్న… అక్కకు తమ్ముడు అండగా నిలవడమే కాదు. తన సోదరుల సంక్షేమాన్ని కాంక్షించాలనేదీ ముఖ్యాంశమే. సాధారణంగా సోదరి రాఖీ కడితే సోదరుడు బహుమతి ఇవ్వడం పాత సంప్రదాయం. అన్నకు రక్షగా చెల్లెలూ బహుమతి అందివ్వాలనేది ఇప్పుడు కొత్త సంప్రదాయం. రాఖీ నేపథ్యంలో నిజామాబాద్‌ ఎంపీ కవిత… తన అన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు శిరస్త్రాణాన్ని కానుకగా అందించారు. చాలామంది వాహనాలపై వెళ్లినప్పుడు శిరస్త్రాణం పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తారు. ప్రతి యువతి/మహిళ ఈ పండుగ రోజున తన అన్న/తమ్ముడికి ఒక శిరస్త్రాణం కొనివ్వాలని కవిత చక్కటి సందేశం ఇచ్చారు. చాలామంది ఆమె ఆలోచనను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే కొందరు యువతులు ఆమె బాటలో నడుస్తున్నారు.

ఒకరి క్షేమం కోసం మరికొకరు… 
సోదరిల రక్షణ బాధ్యతను సోదరులు తమ విధిగా భావించడం పండుగలోని ఆంతర్యం. ఒకరి సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఉజ్జ్వల భవితవ్యాన్ని మరొకరు కాంక్షించి ఆనందాన్ని పంచుకుంటారు. చిన్నారులు, యువతులు, మహిళలు తమ తోబుట్టువులైన అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారి క్షేమం కోసం భగవంతుని ప్రార్థిస్తారు. రక్షాబంధన్‌ తొలుత నూలు పోగుగానే ఉండేది. కాల క్రమేణా నగిషీలు అద్దుకుంది. ప్లాస్టిక్‌ చెమ్కీలు, రంగురంగుల అట్టముక్కలు మొదలు వెండి, బంగారు రాఖీల దాకా ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు రాఖీలు కడుతున్నారు. ఇప్పుడు నగరంలో ఏ సందులో చూసినా రాఖీల అంగళ్లే. మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.లక్ష వరకు ధరల్లో రాఖీలు లభిస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy