అన్ని అర్హతలు ఉన్నాయ్ : ఓటర్ కార్డుగా ఆధార్!?

voter-aadhaarఎన్నికల్లో ఓటు వేయటానికి ప్రత్యేకంగా ఓటర్ కార్డు ఎందుకు.. ఆధార్ కార్డ్, నెంబర్ ను ఎందుకు ఉపయోగించకూడదు అని కొత్త ఆలోచన, చర్చకు తెరతీశారు టీఎస్ కృష్ణమూర్తి. ఓటరు కార్డు స్థానంలో వ్యక్తిగత గుర్తింపుగా ఉన్న ఆధార్ ను ఉపయోగిస్తే మంచిదని సూచించారు ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఉందని.. అలాంటప్పుడు ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓటర్ కార్డు లేని వారికి ప్రత్యామ్నాయంగా పలు గుర్తింపు కార్డులను అనుమతి ఇస్తున్నామని.. ఇవన్నీ లేకుండా ఆధార్ నే ఓటరు కార్డుగా పరిగణిస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని సూచించారు కృష్ణమూర్తి

ప్రతి పథకానికి ఆధార్ అనుసంధానం పూర్తవుతుందని.. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఓటరు కార్డులు ఎందుకుని ప్రశ్నించారు. వాటి కోసం కోట్ల రూపాయల డబ్బు ఖర్చువుతుందని.. ఆధార్ తో అదంతా ఆదా అవుతుందని సలహా ఇచ్చారు కృష్ణమూర్తి. దేశంలో 90శాతం మందికిపైగా ఆధార్ కార్డు ఉందని.. ఇప్పుడు ఎన్నికల గుర్తింపు కార్డుగా అమలు చేయటం చాలా ఈజీ అన్నారు. మాజీ ప్రధానాధికారి సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలా తీసుకుంటాయో చూడాలి..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy