అన్నీ క్లీన్ బౌల్డ్ : ఓవర్లో 6 వికెట్లు తీసిన కుర్రోడు

six wikets1ఒక ఓవర్లో మూడు వికెట్లు తీయడమే గొప్ప. అలాంటిది ఒకే ఓవర్ లో ఆరు వికెట్లు తీస్తే.. అది కూడా క్లీన్‌బౌల్డ్‌ అయితే నిజంగా కచ్చితంగా అద్భుతమే. డబుల్ హ్యాట్రిక్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు కుర్రోడు.

ఇంగ్లండ్‌కు చెందిన 13 ఏళ్ల స్కూల్‌ క్రికెటర్‌ లూక్‌ రాబిన్‌సన్‌ ఈ ఘనత సాధించి.. అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు. ఫిలిడెల్ఫియా క్రికెట్‌ క్లబ్‌ తరఫున అండర్‌-13 క్రికెట్‌ టోర్నీలో బరిలోకి దిగిన రాబిన్‌సన్‌ ఆరు బంతుల్లో ఆరు వికెట్లను పడగొట్టి సంచలనం సృష్టించాడు. వరసగా ఆరుగురు బ్యాట్స్‌మన్‌నూ క్లీన్‌ బౌల్డ్ చేయడం మరో విశేషం. ఈ సమయంలో అతని తల్లి హెలెన్‌ స్కోరర్‌గా వ్యవహరిస్తుండగా.. తండ్రి స్టీఫెన్‌ అంపైరింగ్‌ చేస్తూ అతి దగ్గరి నుంచి ఈ ఫీట్‌ను చూశారు. బాలుడి తాత గ్లెన్ మ్యాచ్‌ని స్వయంగా మ్యాచ్ ను చూసి మనవడు సాధించిన అద్భుత రికార్డుపై సంతోషం వ్యక్తం చేశారు.

149 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే రికార్డ్ అని తెలిపారు క్లబ్ నిర్వాహకులు. ఈ కుర్రోడి రికార్డ్ తెలుసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్.. అతని బౌలింగ్ తీరును పరిశీలించి.. మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy