అపచారం : బీరు బాటిల్ తో గుడిలోకి..

hampi_beer_touristదేశం కాని దేశం.. మన దేవాలయాలు వాటి సంప్రదాయాల గురించి ఏమి తెలియని పరదేశీయుడు. ఎండలు మండిపోతున్నాయనో..అలవాటులో పొరపాటో తెలీదు కానీ సారు బీరు సీసాతో గుడిలోకి వచ్చేసాడు. ఈ ఘటన హంపీలోని ప్రముఖ విరూపాక్ష దేవాలయంలో చోటు చేసుకుంది. ఈ బుధవారం పోలాండ్ నుంచి వచ్చిన ఒక గుర్తుతెలియని విదేశీయుడు గుడిలోకి బీరు తాగుతూ రావటానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది గేటు దగ్గరే నిలదీసారు. ఇక వెంటనే తన భార్య అక్కడికి చేరుకోవడంతో అతన్ని అక్కడినుండి తీసుకెళ్లింది.. వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ ఈ జంట దర్శనమిచ్చింది. ఈ సారి బాటిల్ ను బట్టల్లో పెట్టుకొని వచ్చాడని అయితే  వారిని వారించి అక్కడి నుంచి పంపేసినట్లు సిబ్బంది తెలిపింది. ఈ ఘటన ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో  ఆ ఫోటో హల్ చల్ చేస్తోంది. దేవాలయ సిబ్బంది పోలీసులకు తెలుపగా.. ఈ వ్యక్తి కోసం అంతటా గాలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ దేవాలయానికి కొన్ని వేల మంది టూరిస్టులు వస్తుండటంతో వారి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy