అపారమైన మినరల్స్…. ఇండియన్ ఓషన్ లో

అంతులేని మినరల్స్ కు కేరాఫ్ అడ్రస్ హిందూ మహా సముద్రమే అంటున్నాయి లేటెస్ట్ పరిశోధనలు. సముద్రంలోపల …..పెద్ద ఎత్తున ఖనిజాలు ఉన్నాయన్న విషయం….నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ చేసిన రీసెర్చ్ లో  బయటపడింది. దీంతో ….. సముద్రం లోతుల్లో నుంచి  ఖనిజాలు…. లోహాలను వెలికి తీయడానికి ప్లాన్ రెడీ  చేస్తున్నారు సైంటిస్టులు. ఇండియన్ ఓషన్ లో పెద్ద ఎత్తున మినరల్స్ ఉన్నాయని  ….చాలా రోజుల కిందటే  వెల్లడించాయి శాటిలైట్  తీసిన ఫొటోలు. అయితే, వాటికి స్పష్టమైన ఆధారాలు లేవు. దీంతో, హైదరాబాద్ సెంటర్ గా పనిచేస్తున్న నేషనల్  జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ……ఇండియన్ ఓషన్ ను టార్గెట్ చేసింది. పెద్ద ఎత్తున  పరిశోధనలు మొదలెట్టింది.

ఇండియన్ ఓషన్ పై జరిగిన రీసెర్చ్ లో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. అండమాన్ దీవులకు దగ్గరలో……సముద్రం లోపల….పెద్ద ఎత్తున మినరల్స్ ఉన్నట్టు తేల్చి చెప్పింది ఈ రీసెర్చ్. సముద్రం అట్టడుగున పాలి మెటాలిక్ సల్ఫైడ్ మినరల్స్ పెద్ద ఎత్తున పోగు పడినట్లు బయటపెట్టింది లేటెస్ట్ రీసెర్చ్. మినరల్స్ మాత్రమే  కాదు….సెరియం పేరుతో  పిలిచే….ఎలిమెంట్ కూడా ఉన్నట్లు తేల్చి చెబుతున్నాయి తాజా పరిశోధనలు. ఈ సెరియం  ఎలిమెంట్ ను ….గ్లాస్, సిరామిక్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా వాడతారు.

అయితే, నేషనల్  జియో ఫిజికల్  రీసెర్చ్  ఇన్ స్టిట్యూట్  పరిశోధనల్లో  బయటపడ్డ  మినరల్స్  నిక్షేపాలు  చాలా తక్కువ అంటున్నారు  సైంటిస్టులు.  ఒక్క అండమాన్  దీవుల  దగ్గరలోనే కాదు….చాలా  చోట్ల   మినరల్స్  ఉన్నట్లు   భావిస్తున్నారు.  అసలు  హిందూ  మహా సముద్రంలో …..మినరల్స్  ఎక్కడెక్కడ  ఉన్నాయి…..ఏ సైజులో ఉన్నాయి…..తేల్చి పడేయడానికి  గోవాలోని  నేషనల్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  ఓషనోగ్రఫీ  సాయం తీసుకుంటున్నారు  సైంటిస్టులు.  ఈ స్టడీకి ….కేంద్రం  ఆల్ రెడీ  30 కోట్లు కూడా  అలాట్ చేసింది.

సముద్రంలోపల  ఉన్న ……అరుదైన మినరల్స్  ను  ఎక్కువగా  ఎలెక్ట్రానిక్స్,  బ్యాటరీల తయారీలో  యూజ్  చేస్తారు.  మన దేశ  పారిశ్రామిక అవసరాలు కూడా  తీరుతాయి.  మినరల్స్  ను  బయటి దేశాల నుంచి  దిగుమతి చేసుకునే  అవసరం తప్పుతుంది .  పెద్ద ఎత్తున  ఫారిన్ ఎక్స్ చేంజ్ ఆదా అవుతుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy