అబ్బాయితో అమ్మాయి… పెళ్లి చేసేసిన తండావాసులు

wgl marraige 1ఆ అబ్బాయి, అమ్మాయి రెండు రోజులుగా కలిసి తిరుగుతున్నారు. అక్కడ ఎక్కడ చూసినా వాళ్లే. దీంతో అందరికీ అనుమానమొచ్చింది. ఇద్దరినీ పట్టుకున్నారు. ఓ రూమ్ లో వేశారు. అందరూ కలిసి ఆ జంటకు పెళ్లి చేసేశారు.  వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్.  స్థానిక బాబూ నాయక్ తండా వాసులు వీళ్లు. అబ్బాయి పేరు జగన్.. అమ్మాయి పేరు భూక్యా ప్రమీల. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఇద్దరి చర్యలు శృతి మించడంతో తండావాసులు ఇద్దరినీ పట్టుకుని పెళ్లి చేసేశారు. గతంలో ఇలాగే జరిగిందని.. అయితే అమ్మాయిని అబ్బాయి వదిలేయడంతో ఆమె సూసైడ్ చేసుకుందని.. అందుకే ఇలా పెళ్లి చేశామని క్లారిటీ ఇచ్చారు తండావాసులు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy