అబ్బో అంత రేటే.. గుడ్లు తేలేస్తున్నారు

eggsకోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండు, మూడు రూపాయలుండే ధరలు.. ఇప్పుడు ఏకంగా ఆరు రూపాయలకు చేరుకుంది. రిటైల్‌ధర ఒక్కో గుడ్డుకు ఆరు రూపాయలు అయ్యింది. ఇన్నాళ్లుగా కూరగాయల ధరలే చుక్కలు చూపిస్తుండగా, ఇప్పుడు గుడ్డుధర కూడా భారంగా మారింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, వినియోగం పెరుగడం దృష్ట్యా మరో రెండునెలలు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజురోజుకు ధర పెరుగుతూ సోమవారం ఆల్‌టైం రికార్డును తాకింది. ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తున్నది.

రంగారెడ్డి జిల్లా మార్కెట్‌లో ఆదివారం 100 గుడ్లకు రూ.482 ధర పలుకగా సోమవారం రూ.488 ధర పలికింది. అయితే చిల్లరగా ఒక్కగుడ్డు ధర రూ.6 పలుకుతుండటం గమనార్హం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే నెక్ రంగారెడ్డి రేటు రూ.500 దాటి పరుగులు తీసే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ మాసంలో పెరిగే ధర నవంబర్‌లోనే గరిష్ఠస్థాయికి చేరింది. అటు కూరగాయల ధరలు మండిపోవడం, ఇటు కోడిగుడ్డు ధరలు కొండెక్కడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy