అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ : 65 మందితో తొలి జాబితా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 65 మంది పేర్లతో సోమవారం రాత్రి 11.15 గంటలకు తొలి జాబితా ప్రకటించింది. 119 స్థానాల్లో 26 స్థానాలు మిత్రపక్షాలకు పోను కాంగ్రెస్‌ పోటీ చేసే 93 స్థానాల్లో 74 స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 8న అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే, ఆ జాబితా వెల్లడి కాకుండానే వాటిపై అనేక ఫిర్యాదులు అందడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ స్వయంగా జోక్యం చేసుకుని సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌ దాస్, ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసు రాజు, శ్రీనివాసన్‌ లతో రాహుల్‌ రెండు విడతలుగా సమావేశమయ్యారు.

మధ్యాహ్నం 12.30 నుంచి 2.00 గంటల వరకు, 3 నుంచి 4 గంటల వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఇందులో ప్రధానంగా ఇటీవలే పార్టీలో చేరి అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్నవారు, నేతల ఒత్తిళ్లతో అభ్యర్థిత్వాలు దక్కించుకున్నవారు, సామాజిక సమతుల్యం లేనప్పటికీ అభ్యర్థిత్వాలు దక్కించుకున్నవారు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థిత్వాలు పొందినవారు తదితర వివాదాస్పద అంశాలపై 20 స్థానాల్లో పునఃపరిశీలన జరిపారు. కొన్ని మార్పులు, చేర్పులు చేయించారు.

తర్వాత స్క్రీనింగ్‌ కమిటీ రాహుల్‌ సూచనల మేరకు వార్‌ రూమ్‌ లో సమావేశమై తుది జాబితా రూపొందించింది. ఈ జాబితాపై సోనియాగాంధీ నివాసంలో రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి చర్చించింది. మార్పులు, చేర్పులు ఉన్న స్థానాలపై మాత్రమే చర్చించి ఆమోదించింది. తర్వాత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు కలసి ఏఐసీసీ కార్యాలయంలో లిస్టు ఫైనల్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy