వేదాంతం..కమ్యునిజం & దాశరథి

Screen Shot 2015-06-14 at 2.34.03 PMఅభ్యుదయ భావాలు కలిగిన దాశరథి.. తన రచనలతో.. సాహిత్యంపై చెరగని ముద్ర వేశారన్నారు తెలుగు సాహితీ ప్రముఖులు. వేదాలను తెలుగులోకి అనువదించిన వ్యక్తిగా.. సాహితీ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన దాశరథి సంస్మరణ సభలో పాల్గొన్న రచయితలు, సీనియర్ జర్నలిస్టులు… ఆధ్యాత్మికం, కమ్యూనిజం భావాలు కలిసి ఉన్న  దాశరథి చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రచనలు చేశారని గుర్తు చేసుకున్నారు. అక్షర సైనికుడిగా అలుపెరగని ప్రయాణం చేశారన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో దాశరథి సోదరులు కీలక పాత్రపోషించారన్నారు సీనియర్ పాత్రకేయులు పాశం యాదగిరి. రామాయణంలో అడువులకు వెళ్తూ మునికుమారుల వేషధారణలోనూ రామ, లక్ష్మణులు ఆయుధాలరు ధరించారని… ఆత్మరక్షణకోసం కమ్యునిస్ట్ లు ఆయుధాలు కలిగి ఉండటంలో తప్పులేదన్నారు. దాశరథి బతికున్నప్పుడు  భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది కానీ,  ప్రజాస్వామిక తెలంగాణ రాలేదన్నారు.  ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క. సమాజం గురించి తెలుసుకున్నాకే కవితలు రాయాలని తన తండ్రి చెప్పేవారన్నారు దాశరథి కూమారుడు విరించి. ఇక వేదాలను,మార్కిజాన్ని ఒకే తాటి పైకి తెచ్చిన ఘనత దాశరథికే దక్కుతుందన్నారు కందిమల్ల ప్రతాప్ రెడ్డి.

.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy