అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం

cm-kcrతెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. వారికి ఆర్ధిక సహాయం అందించే ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించారు. ఆ చెక్కులను ప్రభుత్వమే గౌరవపూర్వకంగా అమరుల కుటుంబాలకు అందిస్తుందని చెప్పారు కేసీఆర్. 10 జిల్లాల కలెక్టర్ల ప్రాథమిక నివేదిక ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 462 అమరవీరుల కుటుంబాలను గుర్తించింది ప్రభుత్వం. కరీంనగర్-164, వరంగల్-93, మెదక్-52, నల్గొండ-48, నిజామాబాద్-31, ఆదిలాబాద్-26, రంగారెడ్డి-18, మహబూబ్ నగర్-17, హైదరాబాద్–11, ఖమ్మం జిల్లాలో 2 అమరవీరుల కుటుంబాలను గుర్తించారు. ఇంకా ఎవరైనా అమరవీరుల కుటుంబాలు ఉంటే కూడా ప్రభుత్వమే ఆదుకుంటుందని సీఎం చెప్పారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy