అమరవీరుల వల్లనే తెలంగాణ రాష్ట్రం….

ING-140614-HYD-ASSEMBLY10AM11 00104008ఈరోజు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.  దీనిపై కేసీఆర్ తో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో  పోలీస్ తూటాలకు 369 మంది మృతి చెందారని కేసీఆర్ చెప్పారు. అలాగే మలి దశ ఉద్యమంలో  మరో 1500 మంది ప్రాణాలర్పించారని…అమరువీరుల ప్రాణత్యాగం మరవలేనిదన్నారు కేసీఆర్. చనిపోయిన వారి ప్రాణత్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రం అంటు కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రొ.జయశంకర్ లేని లోటు తీర్చలేనిదన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల అణిచివేతపై జయశంకర్ ఆవేదన చెందారని చెప్పారు.

అమరులకు నివాళులర్పించడం అందరి బాధ్యత అని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి చెప్పారు. అమరుల ప్రాణ త్యాగం మరవలేనిదన్నారు. మలి దశ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని….స్వాతంత్ర సమరయోధులకు కల్పించే సౌకర్యాలు..అమరవీరుల కుటుంబాలకు కల్పించాలని చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ ఏర్పాటు వైఎస్కు ఇష్టం లేదని…2004-09 మధ్య తెలంగాణ ఏర్పాటుకు వైఎస్ అడ్డుపడ్డారని చిన్నారెడ్డి చెప్పారు.

ఇక అమరవీరుల సంతాప తీర్మానానికి టీడీపీ నేత రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రపంచంలో ఏ ఉద్యమం జరగనంతగా..తెలంగాణ ఉద్యమం జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్న రోజును.. అమరవీరుల సంస్మరణ దినంగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామన్నారు.

అమరుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని బీజెపీ నేత లక్ష్మణ్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నవ తెలంగాణ నిర్మాణమే..అమరులకు నిజమైన నివాళన్నారు. జూన్ 2తో పాటు సెప్టెంబర్ 17ను కూడా..అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ సభకు సూచనలిచ్చారు.దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మల విగ్రహాలను..ట్యాంక్ బండ్ పై పెట్టాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

నేతల ప్రసంగంగ తర్వాత సభ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించింది. రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అనంతరం హిమాచల్ప్రదేశ్ మృతులకు కూడా అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. మృతులకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఘటనపై హిమాచల్ప్రదేశ్ సీఎంతో మాట్లాడామని…హోంమంత్రి నాయినితో పాటు ఎంపీలు..అధికారులు అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారని కేసీఆర్ చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy