అమర్ నాథ్ దాడుల వెనక లష్కరే తొయిబా

amarnath-yatraజమ్మూకాశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులపై దాడి కేసులో… పాకిస్తాన్ ప్రమేయాన్ని బయటపెట్టారు పోలీసులు. దాడి చేసింది పాక్ కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులనేని దర్యాప్తులో తేలింది.  ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు.

పాక్ కు చెందిన ఇద్దరు లష్కరే మిలిటెంట్లు, కాశ్మీర్ కు చెందిన మరో మిలిటెంట్ సాయంతో ఇస్మాయిల్ ఈ దాడి ప్లాన్ చేశాడని పోలీసుల దర్యాప్తుల తేలింది. దాడికి సంబంధించి ఓ పాక్ మిలిటెంట్ ను, సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు కుట్రదారులను కూడా ఒకట్రెండు రోజుల్ల పట్టుకుంటామన్నారు పోలీసులు.

కోడ్ భాషలో ఎటాక్ స్కెచ్ గీశారు ఉగ్రవాదులు. టూరిస్టులో వాహనాలకు షౌకత్ అని పేరు పెట్టారు. CRPF జవాన్ల వాహనానికి బిలాల్ అని కోడ్ నేమ్ పెట్టుకున్నారు. టూరిస్టులపై జులై 9న దాడి చేయాలని ముందుగా ఉగ్రవాదులు అనుకున్నారు. అయితే.. CRPF జవాన్ల వాహనాలు, యాత్రికుల వాహనాలు రాకపోవడంతో ఉదయం ప్లాన్ ను అమలుచేశారు. దేశంల హిందూ – ముస్లిం గొడవలు సృష్టించేందుకు పాకిస్తాన్ ఇట్లాంటి దాడులను చేయిస్తోందంటున్నరు అనలిస్టులు. జులై 10న అనంత్ నాగ్ జిల్లాల టూరిస్టుల బస్సు మీద కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఈ దాడిల ఏడుగురు చనిపోగా.. 20 మందికి పైన గాయపడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy