అమలాపాల్ పై కేసు నమోదు

amala paul in saree2[2]ప్రముఖ నటి అమలాపాల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సరెండరయ్యారు. పన్ను ఎగవేత విషయంలో అమలాపాల్‌ కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తప్పుడు చిరునామా పత్రాలు సృష్టించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆమెపై కేరళలో కేసు నమోదైంది. 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఇటీవల ఆమె కేరళ హైకోర్టును సంప్రదించి, ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో న్యాయస్థానం క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తర్వాత కేసు పరిశీలిస్తామని పేర్కొంది. దీంతో అమలాపాల్‌ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులను కలిసిన తర్వాత అమలాపాల్‌ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. గత సంవత్సరం అమలాపాల్‌ రూ. కోటితో ఖరీదైన కారును కొన్నారు. దాన్ని తప్పుడు పత్రాలు ఉపయోగించి, పాండిచ్చేరిలో రిజిస్టర్‌ చేయించారు. కేరళలో పన్ను ఎగవేయాలని ఆమె ఇలా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy