అమానుషం: పసివాడిపై మైనర్‌ మృగం

minor-attackపదేళ్ల పసివాడిపై 17 ఏళ్ల మైనర్‌ బాలుడు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. విషయం బయటపడకూ డదనే అభిప్రాయంతో అతన్ని చంపేశాడు. మిస్సింగ్‌గా నమోదైన ఈ కేసును దర్యాప్తు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులకు సీసీ కెమెరాల్లో చిన్న ఆధారం దొరికింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
బార్కాస్‌ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ జమీల్‌ ఖాన్‌ కుమారుడు మహ్మద్‌ ఖాన్‌(10) స్థానిక లయోలా పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. రంజాన్‌ నేపథ్యంలో బార్కాస్‌ బజార్‌లో ఏర్పాటైన మేళా దగ్గర జూన్‌ 28న ఈ బాలుడు ఆడుకుంటున్నాడు. అక్కడి నుంచి ఖాన్‌ అదృశ్యం కావడంతో కుటుంబీకులు మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న ఖాన్‌కు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మైనర్‌.. అతడిని బార్కాస్‌ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పాఠశాల గ్రిల్స్‌ తొలిగించి భవనంపైకి చేరుకుని, అక్కడే పసివాడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

 విషయం బయటపడకుండా హత్య

బాలుడు తనకు నొప్పిగా ఉందని, విషయం తండ్రికి చెపుతా ననటంతో 17 ఏళ్ల మైనర్‌ మృగం తీవ్రంగా భయపడ్డాడు. జూలై 2న తన సోదరి వివాహం ఉండటంతో విషయం బయటకు వస్తే పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని భావించాడు. అఘాయిత్యం వెలుగులోకి రాకూడదంటే బాలుడిని హత్య చేయడమే మార్గమనుకున్నాడు. అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో బాలుడిపై కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని మాయం చేసే ఉద్దేశంతో కాళ్లు, చేతులు కట్టేశాడు. మృతదేహాన్ని మరో చోటికి మార్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారంతో నింధితున్ని పట్టుకున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy