అమావాస్య రోజు బాలింత మృతి.. ఊరు నుంచి కుటుంబం వెలి

family-veliరంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. అమావాస్య రోజు బాలింత చనిపోయిందని ఓ కుటుంబాన్ని ఇంట్లో కి రానివ్వలేదు ఓనర్లు. దీంతో.. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు.. తల్లి శవంతో సహా కుటుంబ సభ్యులంతా.. చెరువు దగ్గరే టెంట్ వేసుకుని ఉండాల్సి వచ్చింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజాల్ లో జరిగింది.

తుర్కయాంజాల్ లోని… YSR నగర్ లో మహిళ బిడ్డకు జన్మనిచ్చాక చనిపోయింది. దాంతో ఇంటి ఓనర్లు, కాలనీ ప్రజలు.. ఆమె మృతదేహాన్ని అద్దెకుంటున్న ఇంటి దగ్గర ఉండనివ్వలేదు. మూఢ నమ్మకాలతో ఈ విధంగా చేశారంటున్నారు బాధితులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy