అమిత్ షా పై కేసీఆర్ కౌంటర్లు

amith-kcr-punch-siteఅమిత్ షా పై సీఎం కేసీఆర్ తన ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని వ్యక్తం చేశారు.

*నాకు భాదేసి మాట్లాడుతున్న ఈ అమిత్ షా లు బ్రమిత్ షా లు ఈడికొచ్చి నల్లకుంట చౌరస్తల పాము షోలు పెట్టి మా ఇష్టమొచ్చినట్లు ఢాం ఢీం టకారం అంటే నడుస్తదా? ఇట్ల చానామంది బ్రమిత్ షా లను చూస్నడు కేసీఆర్

*అమిత్ షా అనుచిత వాఖ్యలకు చర్చలకు కూడా సిధ్ధం కానీ మేము గరీబొల్లం పెద్ద పెద్ద పదవులు చేయ్యలే.. మాకు లెక్కలు తెలీదు అందుకే అది వారి అజ్ఞానం అని వదిలేశాము

*మై నే బహుత్ తుఫానోంకొ దేఖా హు ఏహ్ హవా భి నహీ హై

*ఫర్ అమిత్ షా ఆర్ ఎనీ షా.. ఫర్ కేసీఆర్ తెలంగాణ ఈజ్ ఓన్లీ బాద్ షా

*వ్యక్తిగతంగా నన్ను తిడితే పడతాను అంతే కాని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క మాట అన్నా కాంప్రమైజ్ అవ్వను

*ఎన్నికలు అనేటివి ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య ఈయన కాకపోతే మల్లయ్యతో పోటీ చేసి గెలవాల మనం యునానిమప్ గా ఎవ్వరు ఓట్లు ఎయ్యరు ఇంట్లో కుసుంటే

*దేశానికి తెలంగాణ ఇచ్చిన దాంట్లో కేంద్రం సగం కూడా ఇవ్వట్లేదు.. దీనికి నవ్వాలా? ఏడ్వాలా? ఎవ్వరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్లు? కేంద్రం నడపడానికి తెలంగాణ డబ్బులిస్తుందా లేక తెలంగాణ నడవడానికి కేంద్రం డబ్బులిస్తుందా? అమిత్ షా దీనికి సమాధానం చెప్పాలి

*మా సొమ్మును మీరు వాడుకుంటున్నారు అంతేకానీ తెలంగాణ ఏదో మీ భిక్షం మీద బతుకుతున్నట్లు ఇష్టమొచ్చిన అబద్ధాలు చెప్పకు అమిత్ షా

*Mr.Amit shah you have said that you are giving additionally 20000 crores to telangana.. Can you show 200 crores ? On what basis you are giving  money to the telangana government ?

*ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడుందో జర చూపెడతవా ? its yet to come.. మరి ఇచ్చినమని ఎట్ల చెప్పినవ్

*అదనం సంగతి దేవుడెరుగు ముందు బకాయిలు 10వేల కోట్లు ఇవ్వండి అయ్యా అమిత్ షా ఢిల్లీకి పోంగనే ఈ పని చేయ్యి… ఇచ్చే పైసలు బీజేపీ గవర్నమెంట్ కాదు పీజేబీ గవర్నమెంట్ ఉన్నా ఇయ్యాల్సిందే

*కరువు క్రింద 6వేల కోట్లు అడిగితే ఇచ్చింది 855 కోట్లు అంటే అదనంగా ఇచ్చినట్లా బొక్క పెట్టినట్లా దీని ఏ విధంగా చూడొచ్చు

*చానా కార్యక్రమాలకు వీళ్లు అంట కత్తెర పెట్టినరు..ఆ బరువు మేము బరిస్తున్నం ఈయాళ దట్ ఈజ్ అవర్ గవర్నమెంట్

*అమిత్ షా సోయ లో మాట్లాడిండా సోయ తప్పి మాట్లాడిండా Mr.Amit shah should know where he is standing and what he is speaking

*తెలంగాణల నిలపడి మాట్లాడతడా.. పెస్షన్లు ఇవ్వడానికి దిక్కు లేదంట ఏదో ఊర్ల అన్నడు

*పెస్షన్లకు మనకు అయ్యే ఖర్చు 5వేల కోట్లు అయితే కేంద్రం ఇచ్చేది 290కోట్లు సముద్రంలో కాకి రేట్టె ఏసినట్లు ఈయన కంట్రిబ్యూషన్ ఆయన పతకమంటా నేను ప్రజల్లోకి తీసుకొని పోతలేనంట కనబడుతుందా అమిత్ షా నువ్వు ఇచ్చేదేందో మేము తీనుకుబోయేదేందో

*Im challenging amit shah నేను చేసిన ప్రకటనలో తప్పులు ఉంటే Im ready to resign to my CM post

*మా రాష్ట్ర ప్రగతిని దెబ్బ తీస్తవా నువ్వు నీ చిల్లర రాజకీయాల కోసం

*We are not the begging state Mr.Amit shah we are one of the richest states in India

*పెన్షన్లు ఇచ్చే దిక్కులేదు,ప్రజలని చూసే దిక్కు లేదు ఏంది మేమా ప్రజలను చూడంది.. మీ దళితుల ప్రేమ. నువ్వొచ్చి ఇక్కడ మూడు దళిత వాడల్లో తినట్లు నటించినవ్.. నువ్వు తిన్న భోజనం దళిత వాడలో పండనేలే అసలు

*వాస్తవం ఇట్లుంటే నువ్వెక్కడో మామిడి తోటలో వంటలు వండించుకొని దళిత వాడల్లో టేబుల్లేసుకొని తిని పేపర్లలో ఫోటోలేస్తే మేము చక్కరొచ్చి పడిపోవాల్నా ఈ గిమ్మిక్స్ ఈ డ్రమాలు మాకు తెల్వనియా

* అక్కడ దళిత లీడర్ ను వెనక నిలబెట్టి మీరు టేబుల్ల మీద తింటరా.. మేము కూడా చూస్తమండీ టీవీల మీరేమో ఇక్కడికొచ్చి ఢాం ఢీం భూం అంటే అయిపోతదా? అడ్డం పొడుగు మాట్లాడి టీ ఆర్ ఎస్ గవర్నమెంట్ మీద ఇంత చల్లిపోతం అంటే నడుస్తదా?

*ఈ గిమ్మిక్కుల మీద తెలంగాణ లాంటి గడ్డ మీద రాజకీయం చేస్తమంటే అది అమాయకత్వం,పిచ్చితనం అయితది. ఇది కరెక్ట్ కాదు

*హై కోర్టు హైదరాబాద్ లో ఉందని ఆ అమిత్ షా ఢిల్లీ నుంచి వచ్చి చెప్పాల్నా మాకు తెల్వదా ఇక్కడున్న సంగతి. తమాష కరహే క్యా హమే నహీ జాంతే !!

*కేంద్ర పథకాలు రాష్ట్రంలో క్షేత్ర స్ధాయికి చేరుకోవట్లేదట ఎవ్వళ్లు చేరగొట్టాలె నీ పథకాలు మంచిగున్నయో మావి మంచిగున్నయో కనబడుతునే ఉన్నయి మీకన్నా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నం మేము

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy