అమీర్‌ పేట్-LB నగర్‌ : మెట్రో టెస్ట్ రన్

Hyderabad-Metro-LB NAGER TO AMEERPETహైదరాబాద్ నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రాజెక్టులో మరో కీలక అడుగు ముందుకుపడింది. అమీర్‌ పేట-LB నగర్‌ కారిడార్‌లో మెట్రో రైలు పరీక్షల కోసం పరుగులు పెట్టింది. దీంతో సిటీ వాసులకు టెస్ట్‌ రన్‌ తో కొంత రిలీఫ్ కలిగింది. త్వరలోనే మెట్రో తమ ప్రాంతాల మీదుగా పరుగులు పెట్టనుందంటూ సంబరపడుతున్నారు. మొదటి రోజు జరిగిన టెస్ట్‌ రన్‌ పనులను స్థానికులు ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. బుధవారం (ఏప్రిల్-11) ఉదయం వేళల్లో మియాపూర్‌ డిపో నుంచి బయలు దేరిన మెట్రో రైలు అమీర్‌పేట ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ నుంచి LB నగర్‌ వైపు టెస్ట్‌ రన్‌ కోసం ముందుకు కదిలింది. జూన్‌ వరకు మెట్రోను ప్రారభించేలా ప్లాన్ చేసి పనులను చేపట్టారు. ఇప్పటి వరకు ట్రాక్‌ నిర్మాణం, కరెంటు, సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌ పనులు పూర్తి చేసిన మెట్రో అధికారులు.. రైలును టెస్టు కోసం నడిపారు. ప్రతి రోజూ 3-4 కి.మీ చొప్పున lB నగర్‌ వరకు టెస్ట్‌ రన్‌ ను నిర్వహించిన తర్వాత ట్రయల్‌ రన్‌ ను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ మార్గంలో అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాత కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైలు సేప్టీ నుంచి అంతిమంగా అనుమతి పొందిన తర్వాతే ప్రయాణికులను అనుమతించనున్నారు. అప్పటి వరకు ఈ మార్గంలో పలుమార్లు టెస్ట్‌ రన్‌, ట్రయల్‌ రన్స్‌ ను నిర్వహించనున్నారు. నిర్మాణంలో ఉన్న మెట్రో పనులను త్వరగా పూర్తి చేసి మెట్రోను ప్రయాణికులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈమేరకు జూన్‌ వరకు అమీర్‌పేట-LB నగర్‌ కారిడార్‌ లో మెట్రో రైలును ప్రారంభించి, అమీర్‌ పేట-హైటెక్‌ సిటీ మార్గాల్లో ఆగస్టు నాటికి మెట్రో రైలును ప్రారంభించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ఇక మిగిలిన కారిడార్‌-2 (JBS- MGBS)లో 2018 చివరి నాటికి పరుగులు పెట్టనుంది మెట్రో.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy