అమీర్ ఖాన్ 95 కిలోలు పెరిగాడట..!

Aamir-Khan002అమీర్ సినిమాల్లోనే ఏదో వైవిద్యం ఉంటుంది. ఎప్పుడూ ప్రయోగాలకు సై అంటాడు అమీర్. రీసెంట్ గా పీకే తో బాక్సాఫీస్ ను బద్దలు చేశాడు అమీర్. నాచురాలిటీ కోసం ఏదైనా చేయడానికి వెనుకాడడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తాజాగా ‘దంగల్ ‘ అనే మూవీ లో అమీర్ నటిస్తున్నాడు. ఈ మూవీ ఇండియన్ మల్లయోధుడు మహావీర్ పోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. నితేష్ తివారీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. నిజంగా మల్లయోధుడిగా కనిపించడం కోసం అమీర్ ఖాన్ 27 కిలోల బరువు పెరిగాడట. రీసెంట్ గా ముంబైలో ఓ కార్యక్రమంలో బరువు పెరిగిన అమీర్ ను చూసి అందరు షాక్ అయ్యారట. పీకే సినిమా షూటింగ్ టైమ్ లో 68 కిలోల బరువు ఉండేవాడట అమీర్. జులై లో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ మూవీ షూటింగ్ ఆరు నెలలు ఉంటుందట. తర్వాత మళ్లీ బరువు తగ్గేస్తా అంటున్నారు అమీర్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy