అమెజాన్ ‘గ్రేట్‌ ఇండియా సేల్‌’.. 6500 టెంపరరీ ఉద్యోగాలు

Amazonతాత్కాలిక ఉద్యోగుల కోసం భారీ ప్రకటన విడుదల చేసింది అమెజాన్. మొత్తం 6500 ఉద్యోగులను నియమించనుంది. ఈ నెల 20-24 మధ్య జరిగే అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా సేల్‌’ లో భాగంగా ఈ టెంపరరీ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. అమెజాన్‌ ఇండియా పరిధిలోని నెట్‌వర్క్‌ సెంటర్లు, వచ్చిన ఆర్డర్లను పరిశీలించి వస్తువులను సిద్ధం చేయటం, డెలివరీ స్టేషన్లు సహా పలు విభాగాల్లో 5,500 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు  అమెజాన్‌ ఇండియా తెలిపింది. కస్టమర్ సర్వీస్ సెంటర్ లో మరో వెయ్యి మంది అసోసియేట్లను నియమించనున్నారు. కొత్త నియామకాల ద్వారా సంస్థకు అదనపు బలం చేకూరడంతో పాటు, వినియోగదారులకు వేగంగా వస్తువులను అందించొచ్చని తెలిపింది అమెజాన్ ఇండియా. హైదరాబాద్‌, బెంగళూరు సహా అన్ని మెట్రో నగరాల్లో ఈ నియమాకాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమెజాన్‌ ఇండియాకుదేశవ్యాప్తంగా 41 నిర్వహణ కేంద్రాలు, 25 సార్టేషన్‌ సెంటర్లు, సుమారు 150 డెలివరీ కేంద్రాలు, 350 సర్వీస్‌ పార్టనర్‌ కేంద్రాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy