అమెరికన్ ఆర్మీలో ఇండియన్.. జీతం రూ.కోటి

monarkNRIకి భారీ ఆఫర్ ఇచ్చింది అమెరికన్ ఆర్మీ. జైపూర్‌కు చెందిన మోనార్క్ శ‌ర్మ యూఎస్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. AH-64E కంబాట్ ఫైట‌ర్ హెలికాప్ట‌ర్ యూనిట్‌లో సైంటిస్ట్‌గా ఉద్యోగం వ‌చ్చింది. ఏడాదికి అత‌ని జీతం రూ.1.2 కోట్లు కావ‌డం విశేషం. ఈ ఏడాది యూఎస్ ఆర్మీలో చేరిన ఫైట‌ర్ హెలికాప్ట‌ర్ల డిజైన్‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌, త‌య‌రీ, నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లను మోనార్క్ చూసుకోవాల్సి ఉంటుంది.

ఆర్మీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించాడు శర్మ. 2013లో నాసాలోని మాస్ క‌మ్యూనికేష‌న్ వింగ్‌లో పని చేసిన మోనార్క్ శ‌ర్మ…  ఆ త‌ర్వాత మే 2016లో యూఎస్ ఆర్మీలో చేరాడు. మోనార్క్ శ‌ర్మ జైపూర్‌లోని నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ చేశాడు. అత‌ని తండ్రి ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. నిజానికి ఇండియ‌న్ ఆర్మీకి తాను సేవ‌లు చేయాల‌ని భావించినా అది కుద‌ర‌లేద‌ని, యూఎస్ ఆర్మీలో ఆ ప‌ని చేసి ఇండియాకు పేరుప్ర‌తిష్ట‌లు తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లు శ‌ర్మ చెప్పాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy