అమెరికాకు గ్రహణం మానియా : 14 రాష్ట్రాలకు పోటెత్తిన జనం

eclipseఅమెరికాను గ్రహణం మేనియా పట్టుకుంది. గ్రహణాన్ని చూడ్డానికి తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. ఏ రోడ్డు చూసినా.. గ్రహణం స్పాట్ లకు వెళ్లే వారితో నిండుగా కనపడుతున్నాయి. గత వందేళ్లలో మొత్తం అమెరికా వ్యాప్తంగా కనపడుతున్న తొలి గ్రహణం ఇది. దీన్ని గ్రేట్ సోలార్ ఎక్లిప్స్ గా పిలుస్తున్నారు నాసా సైంటిస్టులు. ఇలాంటి గ్రహణం అమెరికాలో రావడం 1918 తర్వాత ఇదేనట. అంతేకాదు గత 38 ఏళ్లలో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం రాలేదట. మూడున్నర గంటల పాటు సాగనున్న గ్రహణం.. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.10 గంటలు. మధ్యాహ్నం 2.30 గంటలకు పూర్తికానుంది. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోమాత్రమే కనిపించనుంది. అయితే, అది భారత్‌లో రాత్రి సమయం. అందువల్ల ఇండియాలో కనిపించే అవకాశం లేదు. ఫలితంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం భారత్‌పై ఏమాత్రం ఉండదు.

జీవితకాలంలో ఒక్కసారి దక్కే ఈ అవకాశాన్ని … కనులారా చూడ్డానికి అమెరికన్లు పెద్ద ఎత్తున తరలివెళుతున్నారు. హైవేలన్నీ కార్లతో నిండిపోయాయి. గ్రహణం చూడ్డానికి ఏర్పాటు చేసిన ప్రాంతాలు మేడారం జాతరను తలపిస్తున్నాయి.  అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుని.. గ్రహణం కోసం వెయిట్ చేస్తున్నారు. సూర్యదేవాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పండగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేదు.. అన్ని వయస్సుల వారు గ్రహణాన్ని చూడ్డానికి తరలివచ్చారు. డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. భోజన వసతి ఏర్పాటు చేశారు.

ఒరెగాన్ నుంచి దక్షిణ కరోలినా వరకు 14 రాష్ట్రాల మీదుగా మొత్తం 90నిమిషాల్లో సూర్యగ్రహణ ఛాయ వెళ్లిపోనుంది. ది గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్‌గా పిలుస్తున్న ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నాసా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 50 భారీ బెలూన్లను ఆకాశంలోకి పంపనున్నారు. నాసా భాగస్వామ్యంతో మోంటనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నది. సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో దాదాపు 80వేల అడుగుల ఎత్తు వరకు ఈ బెలూన్లను పంపనున్నారు. వీటికి అమర్చిన కెమెరాల ద్వారా గ్రహణ దృశ్యాలను చిత్రీకరించి లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అత్యంత నాణ్యతతో కూడిన వీడియోలను, చిత్రాలను అందించే కెమెరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. ఒక్కొక్కటి 9 అడుగుల పొడవుండే ఈ భారీ బెలూన్లలో హీలియం వాయువును నింపనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy