అమెరికానే ముస్లింల‌కు మొదటి శ‌త్రువు: అల్‌ఖైదా

al-zawahiriఅమెరికానే ముస్లింలకు మొదటి శత్రువన్నాడు అల్‌ఖైదా నాయకుడు ఐమన్‌ అల్‌ జవహరి. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై  తీవ్రంగా స్పందించాడు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమెరికాపై జిహాద్‌ చేపట్టాలని ముస్లింలకు పిలుపునిచ్చాడు. అమెరికా నిర్ణయం పాలస్తీనియ‌న్లు ఇప్పటి వరకు అనుసరిస్తున్న చర్చల ప్రక్రియలో ఎలాంటి అభివృద్ధి లేదనడానికి నిదర్శమని స్పష్టం చేశాడు. వాస్తవానికి ఇజ్రాయెల్‌ రాజధాని కూడా ముస్లింలకు చెందిన భూభాగమేనని ఆ వీడియోలో ఐమన్‌ అల్‌జవహరి తెలిపాడు.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy