అమెరికాలో కరీంనగర్‌ విద్యార్థి గుండెపోటుతో మృతి

మిన్నెసోటా‌: అమెరికాలోని మిన్నెయాపోలిస్‌ నగరంలో భార్గవ్‌ రెడ్డి ఇత్తిరెడ్డి(25) అనే తెలంగాణ విద్యార్థి ఆకస్మికంగా మృతిచెందాడు. బుధవారం( నవంబర్ 7న) గుండెపోటు రావడంతో తోటి స్నేహితులు దగ్గరలోని మెడికల్‌ సెంటర్‌కు తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే చనిపోయాడు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లాకు చెందినవాడు ఇత్తిరెడ్డి భార్గవ్‌ రెడ్డి. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తీగలగుట్టపల్లి అతడి స్వస్థలం. నార్త్‌ టెక్సాస్‌ యూనివర్సిటీలో భార్గవ్‌ ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

ఉద్యోగం వెతుక్కునేందుకు టెక్సాస్‌ నుంచి మిన్నెయాపోలిస్‌ నగరానికి ఇటీవల వెళ్లాడు. చిన్నవయసులోనే మృతిచెందడంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడూ ఇతరులకు సహాయపడే మనస్తత్వం భార్గవ్‌దని స్నేహితులు చెప్పారు. భార్గవ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భార్గవ్‌ రెడ్డి మృతి విషయం తెలిసిన ఆయన కుటుంబసభ్యులు కరీంనగర్ లో శోకసంద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy