అమెరికాలో కుప్పకూలిన విమానం..9 మంది మృతి

US MILITARY FLIGHTజార్జియాలోని ఓ రహదారిపై అమెరికా సైనిక విమానం కుప్పకూలింది.   ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. బుధవారం ( మే-2)సవాన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 9 మంది మిలటరీ సిబ్బందితో టేకాఫ్‌ అయిన విమానం కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. 50 ఏళ్ల నుంచి ఈ విమానం అమెరికా వైమానిక దళంలో సేవలందించింది. ఇక రిటైర్మెంట్‌ సమయం వచ్చిందని, దాన్ని స్టోర్‌ రూమ్‌ కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో ఆ విమానం అగ్నిగుండం వలే నేలపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.  అదృష్టవశాత్తు విమానం రోడ్డుపై పడిన సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు. C-130 రకానికి చెందిన ఈ కార్గో విమానాన్ని ప్రస్తుతం ప్యూటో రికో ఎయిర్‌ నేషనల్‌ గార్డ్స్‌ వినియోగిస్తున్నారు. నేషనల్‌ గార్డ్స్‌ ప్రతినిధి పాల్‌ డాలెన్‌ మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన విమానం 50 ఏళ్ల క్రితం నాటిది అయినప్పటికీ, అది ప్రస్తుతం కండీషన్‌లోనే ఉందని వెల్లడించాయి.  అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy