అమెరికాలో తెలుగు విద్యార్ధి కాల్చివేత

Untitled-1అమెరికాలోని కాలిఫోర్నియాలో వరంగల్ కు చెందిన మామిడాల వంశీ.. అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లా వంగపహాడ్ గ్రామానికి చెందిన మామిడాల వంశీ.. చనిపోయినట్లు కొద్దిసేపటి కింద అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే.. వంశీని దొంగలు కాల్చి చంపినట్టు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు.. కాలిఫోర్నియాలోని ఇలారా అపార్ట్ మెంట్స్ లో కారు చోరీపై.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను తుపాకులతో బెదిరించిన దుండగుడు.. కారు తాళాలను బలవంతంగా తీసుకున్నాడని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ సమయానికి వంశీ అక్కడే ఉన్నట్టు సమాచారం. మహిళ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు.. అపార్ట్ మెంట్ కు చేరుకున్నారు. అదే సమయంలో తుపాకి పేలిన శబ్దాన్ని గుర్తించారు. ఆ వెంటనే కారులో పారిపోతున్న దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అతను తప్పించుకున్నాడు. తర్వాత.. అపార్ట్ మెంట్ పార్కింగ్ స్థలంలో ఓ యువకుడు మరణించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ డెడ్ బాడీ వంశీదే అన్న విషయాన్ని ఇంతవరకూ పోలీసులు ధృవీకరించలేదు. కనీసం అతని డెడ్ బాడీని చూసేందుకు కూడా ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తేనే.. మృతదేహాన్ని చూసేందుకు అవకాశం ఇస్తారని చెప్పినట్లు సమాచారం.

ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం.. కారు దొంగతనం చేసిన దొంగ… పారిపోయే ప్రయత్నంలో.. వంశీని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అమెరికాలో సమయం ప్రకారం శుక్రవారం రాత్రి హత్య జరిగిందని.. శనివారం ఉదయం దాదాపు ఐదున్నర గంటల వరకూ శవం అలాగే పడి ఉందని సమాచారం. అప్పటివరకూ.. శవాన్ని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పోలీసులు ఇంకా అధికారికంగా ఏ విషయాన్ని ధృవీకరించకపోవడంతో.. కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy