అమెరికాలో బటర్ ఫ్లైస్ కోసం హైవే..!

Butterfly_Highway_Logo_webమోనార్క్ జాతి సీతాకోక చిలుకల సంరక్షణ కోసం హైవే

బటర్ ఫ్లై పేరు వచ్చేలా ఫ్లైవే అని పేరు

దీనికోసం 32 లక్షల డాలర్లు కేటాయింపు

2 లక్షల ఎకరాల్లో బటర్ ఫ్లై హైవే

తగ్గిపోతోన్న సీతాకోక చిలుకలు

మిల్క్ వీడ్ మొక్కలకు పెంచాలని డిసైడ్

రోడ్లు దేనికోసం వేస్తారు. ఆ…అదేం క్వశ్చనూ… కార్లు..బైకులు..బస్సులు.. ఆటోలు…ఇలా అన్ని వెహికల్స్ తిరగడానికి వేస్తార్ కదా. కానీ.. అక్కడ ఇంకోదాని కోసం కూడా రోడ్లేస్తరు. వెహికల్స్ కి కాకుండా..ఇంకోదానికోసం రోడ్లేస్తరా…ఏంటబ్బా..? అని థింక్ చేయకండి. ఎందుకంటే…మీ ఆలోచనకు కూడా అందదది. స్టేట్ హైవేస్ చూశాం. నేషనల్ హైవేసూ చూశాం. కానీ…బటర్ ఫ్లై హైవే ఏక్కడైనా చూశారా..? ఏంటీ..? బటర్ ఫ్లై హైవేనా. ఎస్..మీరిన్నద్దని నిజమే. సీతాకొక చిలుకల కోసమే ఓ హైవే రాబోతోంది ఫ్యూచర్ లో. కాకపోతే అది మన ఇండియాలో కాదు. యూఎస్ లో.

సీతాకొక చిలుకల కోసం హైవే నిర్మిస్తుంది అమెరికా. అంతరించిపోతున్న మోనార్క్ జాతికి చెందిన సీతాకోక చిలుకల కోసం ఈ హైవేను నిర్మిస్తారట.  దీనికోసం.. 32 లక్షల డాలర్లు కేటాయించిందట ఒబామా సర్కార్. రెండు లక్షల ఎకరాల్లో….ఈ హైవేను నిర్మిస్తున్నారట. దీనికి హైవే అని కాకుండా…బటర్ ఫ్లై పేరు వచ్చేలా…ఫ్లైవే అని పేరు కూడా పెట్టారు. అమెరికాలోని మినిసొట ప్రాంతంలో ఈ మోనార్క్ బటర్ ఫ్లై ఎక్కువగా ఉంటాయి. అవి మెక్సికోకు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఎంతో బ్యూటీఫుల్ గా ఉండే ఈ సీతాకోక చిలుకల జాతి..కొంతకాలంగా అంతరించిపోతోంది. ఇక్కడ 1990లో 970 మిలియన్ బటర్ ఫ్లైస్ ఉంటే…ఇప్పుడవి కేవలం..30 మిలియన్ బటర్ ఫ్లైసే ఉన్నాయట.

సిటీ పొల్యూషన్, రైతుల ఉపయోగించే కెమికల్స్ తో…వీటి జాతి క్రమంగా అంతరించిపోయింది. అలా చనిపోతున్న మోనార్క్ బట్టర్ ఫ్లైస్ జాతిని మళ్లీ అభివృద్ధి చేయడానికే…ఒక స్పెషల్ హైవే ఏర్పాటు చేస్తోంది. అవి తిరిగే ఏరియాలో..మిల్క్ వీడ్ మొక్కలను పెంచుతున్నారు. మిల్క్ వీడ్ మొక్కలకు…సీతాకోక చిలుకలు జల్దీగా అట్రాక్ట్ అవుతాయట. ఆ మొక్కలపై వాలి గుడ్లుపెట్టే ఛాన్స్ ఉంటుంది. సో..దీంతో మళ్లీ బోలెడు మోనార్క్ సీతాకోక చిలుకలు పుట్టుకొస్తాయట. ఏదీ ఏమైనా…సీతాకోక చిలుకల కోసం స్పెషల్ హైవే అన్నది ఇంట్రెస్టింగ్ కదా.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy